ఇద్దరు అదృశ్యం
కాలకృత్యాలకు వెళ్లి వ్యక్తి..
సంగారెడ్డి క్రైమ్: కాలకృత్యాల కోసం బస్సు దిగిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామానికి చెందిన వడ్డీ పెంటయ్య, భార్య రాములమ్మతో 18న హైదరాబాద్‌లోని ఎల్లమ్మ బండ వద్ద ఉండే కుమారుడిని చూడడానికి బయలుదేరారు. మతిస్థిమితం సరిగా లేని పెంటయ్య సంగారెడ్డి కొత్త బస్టాండ్‌లో భార్యతో చెప్పి కాలకృత్యాల కోసం దిగాడు. బస్సు బయలుదేరే సమయానికి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో వెంటనే రాములమ్మ కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. మహేశ్ వచ్చి తండ్రి కోసం ఆరా తీసిన ఫలితం దక్కలేదు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి..
పటాన్‌చెరు టౌన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన పెద్ద లక్ష్మయ్య మేసీ్త్ర పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. 14న పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు నిద్రలేచి చూడగా లక్ష్మయ్య కనిపించలేదు. తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. చిన్నాన్న కనబడడం లేదని కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment