మనోహరాబాద్(తూప్రాన్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. గురువారం ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామంలో కమలేష్‌యాదవ్ (25) వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య మమత, కుమారుడు, కూతురు ఉన్నారు. కమలేష్‌యాదవ్ తాగుడుకు బానిసయ్యాడు. బుధవారం రాత్రి బాగా తాగి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. జీవితంపై విరక్తి చెంది గురువారం ఉద యం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకగా గ్రామ శివారులోని శ్మశానవాటిక పక్కన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య మందలించడంతో భర్త..
దుబ్బాకటౌన్ : తరచూ మ ద్యం సేవిస్తున్నావని భార్య మందలించడంతో ఉరేసుకొని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాయపోల్ మండలం గొల్లప ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం రాయపోల్ పోలీసుల కథనం మేరకు.. రాయపోల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎంకొల్ల కుమార్ (35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం కుమార్ మద్యం సేవించి ఇంటికొచ్చాడు. భార్య మద్యం ఎందుకు తాగి వచ్చావని మందలించి, అమ్మమ్మగారి గ్రామం చేగుంట మండలం అన్నసాగర్ వెళ్లిపోయింది. భర్త కుమార్ అదే రోజు సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య మహంకాళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘుపతి తెలిపారు.
ఉరేసుకొని మహిళ
కంది(సంగారెడ్డి): ఉరేసుకొని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన కందిలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌సై రవీందర్ కథనం మేరకు.. కందికి చెందిన హేమంత్, హేమలత(34) దంపతులకు ఇద్దరు కుమారులు. హేమంత్ బుధవారం రాత్రి ఇంటికి రాగా భార్య తలుపులు తీయలేదు. దీంతో పగులగొట్టి చూడగా హేమలత చీరతో ఉరేసుకొని కనిపించింది. మృతురాలి తల్లి క్యాసారం అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
శేఖాపూర్ తండాలో రైతు..
జహీరాబాద్ టౌన్: ఉరేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన కిషన్ నాయక్ పవార్(50)కు సొంత పొలం ఉండగా వ్యవసాయం పనులు చేసుకుంటున్నాడు. అప్పుల బాధ లేక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య