ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం.. వరల్డ్‌ నంబర్‌-2కు షాక్‌ | Alexander Zverev Stuns Carlos Alcaraz To Reach Australian Open Semi Finals | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం.. వరల్డ్‌ నంబర్‌-2కు షాక్‌

Published Thu, Jan 25 2024 8:42 AM | Last Updated on Thu, Jan 25 2024 8:42 AM

Alexander Zverev Stuns Carlos Alcaraz To Reach Australian Open Semi Finals - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం నమోదైంది.  పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) కథ ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–1, 6–3, 6–7 (2/7), 6–4తో అల్‌కరాజ్‌ను ఓడించి సెమీఫైనల్లో మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)తో పోరుకు సిద్ధమయ్యాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో మెద్వెదెవ్‌ 7–6 (7/4), 2–6, 6–3, 5–7, 6–4తో తొమ్మిదో సీడ్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌)పై గెలిచాడు.

మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో క్వాలిఫయర్‌ డయానా యాస్‌ట్రెమ్‌స్కా (ఉక్రెయిన్‌) 6–3, 6–4తో లిండా నొస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై... 12వ సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా) 6–7 (4/7), 6–3, 6–1తో అనా కలిన్‌స్కాయ (రష్యా)పై గెలిచి తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement