భారత క్రికెట్ జట్టు దాదాపు నెల రోజుల విరామం తర్వాత మళ్లీ తిరిగి మైదానంలో అడుగు పెట్టనుంది. స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ కోసం భారత జట్టు అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఈ సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జడేజా, అశ్విన్ మినహా మిగితా భారత ఆటగాళ్లందరూ దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో భాగమయ్యారు.
ఈ టోర్నీలో ప్రదర్శనల ఆధారంగా బంగ్లాతో సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశముంది. వచ్చే వారంలో భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాతో సిరీస్‌కు ఎంపికయ్యే భారత ఆటగాళ్లందరూ సెప్టెంబర్ 12న చెన్నైలో సమావేశం కానున్నారు. బంగ్లాతో తొలి టెస్టు కోసం చెపాక్‌లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా ఆటగాళ్లు పాల్గోనున్నారు. ఈ ప్రాక్టీస్ శిబిరంసెప్టెంబర్ 13 నుండి 18 వరకు కొనసాగుతుంది.
హిమాన్షుకు పిలుపు..
ఇక బంగ్లాతో తొలి టెస్టుకు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై యువ ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్‌ను నెట్ బౌలర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. చెన్నైలో ఏర్పాటు చేయనున్న టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్‌లో హిమాన్షును చేరాలని భారత క్రికెట్ బోర్డు ఆదేశించింది.
బంగ్లా జట్టులో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నందున వారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆఫ్ స్పిన్నర్ హిమాన్షుతో భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది. ఇటీవల కాలంలో టీమిండియా ఆటగాళ్లు స్పిన్‌కు కాస్త ఇబ్బంది పడుతుడండంతో హిమాన్షును నెట్ బౌలర్‌గా బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అతడికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. 21 ఏళ్ల హిమాన్షు.. డాక్టర్ (కెప్టెన్) కె తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో తన అద్భుతమైన ప్రదర్శనకనబరిచాడు. తాజాగా ఆలూర్-1 గ్రౌండ్‌లో ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో సత్తాచాటాడు.
ముంబై సీనియర్ టీమ్‌కు ఇప్పటివరకు అతడు ప్రాతినిథ్యం వహించకపోయినప్పటకి.. ముంబై U-16, U-23 జట్లు తరపున అదరగొట్టాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్లు దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లకు బౌలింగ్ చేసే బంపరాఫర్‌ను హిమాన్షు కొట్టేశాడు.
Comments
Please login to add a commentAdd a comment