'నిజంగా సిగ్గు చేటు'.. భారత్‌-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై డివిలియర్స్‌ సంచలన వ్యాఖ్యలు | De Villiers Frustrated On IND-SA Test Series | Sakshi
Sakshi News home page

IND vs SA: 'నిజంగా సిగ్గు చేటు'.. భారత్‌-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై డివిలియర్స్‌ సంచలన వ్యాఖ్యలు

Published Sat, Dec 2 2023 8:27 PM | Last Updated on Mon, Dec 4 2023 1:18 PM

De Villiers Frustrated On IND-SA Test Series  - Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ సుదీర్ఘ పర్యటనలో భాగంగా 3 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో ప్రోటీస్‌తో భారత్‌ తలపడనుంది. ఈ సిరీస్‌ల కోసం ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను కూడా బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా టూర్‌ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌- సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌ కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రం పరిమితం కావడమే తన నిరాశపరిచిందని డివిలియర్స్‌ తెలిపాడు. కాగా టీ20,వన్డే సిరీస్‌ అనంతరం దక్షిణాఫ్రికా-భారత్‌ టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు ఒక్కసారి టెస్టు సిరీస్‌ గెలవని టీమిండియా.. ఈసారి చరిత్రను తిరగరాయాలని పట్టుదలతో ఉంది. 

"భారత్‌-ప్రోటీస్‌ మధ్య కేవలం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ వుండడం ఒక సౌతాఫ్రికన్‌గా నన్ను తీవ్ర నిరాశపరిచింది.  భారత్‌లో ఆడేటప్పుడు ఒక్కో సిరీస్‌కు 3 నుంచి 4 టెస్టు మ్యాచ్‌లు ఉంటాయి. ఆసీస్‌, ఇంగ్లండ్‌ కూడా భారత పర్యటనకు వెళ్లినప్పుడు 3 నుంచి 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతున్నాయి.

టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా-భారత్‌కు గొప్ప పోటీ ఉంది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సిరీస్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే పెట్టడం సిగ్గుచేటు. క్షిణాఫ్రికాకు రావడానికి భారత ఆటగాళ్లు ఇష్టపడుతున్నారు. ఈ వరల్డ్‌ గ్రేటేస్ట్‌ పోటీలో కేవలం రెండు మ్యాచ్‌లు పెట్టడం సరైన నిర్ణయం కాదు అని తన యూట్యూబ్‌ ఛానల్‌లో డివిలియర్స్‌ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement