మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్-2024) వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్‌కు జాక్‌పాట్ తగిలింది. సదర్లాండ్‌ను రూ. 2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. బేస్ ప్రైస్ రూ.40 లక్షలతో వేలంలోకి వచ్చిన ఈ యువ ఆల్‌రౌండర్‌పై కాసుల వర్షం కురిసింది. కాగా ఈ వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది.
చివరికి ముంబై వెనుక్కి తగ్గడంతో అన్నాబెల్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది. కాగా సదర్లాండ్ గత సీజన్లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడింది. తొట్టతొలి వేలంలో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌ను రూ. 70 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వచ్చే ఏడాది సీజన్‌కు ముందు గుజరాత్ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన ఆమెను ఢిల్లీ భారీ ధరకు దక్కించుకుంది. సదర్లాండ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవల ముగిసిన మహిళల బిగ్ బాష్ లీగ్‌లో కూడా దుమ్మురేపింది. ఈ టోర్నీలో 304 పరుగులతో పాటు 21 వికెట్లు పడగొట్టింది.
🚨🔒 Delhi Capitals breaks the bank for Aussie Annabel Sutherland, getting her for INR 2 CR #WPLAuction | #TATAWPL | #WPL2024 pic.twitter.com/hkNY2RFVSx
— Sportstar (@sportstarweb) December 9, 2023
Comments
Please login to add a commentAdd a comment