ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ (4 సార్లు ఛాంపియన్, 9 సార్లు ఫైనలిస్ట్) మహేంద్ర సింగ్ ధోనిపై రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ మాజీ పర్ఫామెన్స్ అనలిస్ట్ కోచ్ ప్రసన్న అఘోరామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2016 సీజన్‌లో ధోని పూణే కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో తాను ఆ జట్టు పర్ఫామెన్స్ అనలిస్ట్ కోచ్‌గా ఎంపికయ్యానని, తమ తొలి మీటింగ్‌లో ధోని ప్రవర్తన ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించిందని నాటి విషయాలకు క్రిక్‌బజ్‌తో పంచుకున్నాడు.
తొలుత ధోనితో కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు చాలా లక్కీగా ఫీల్ అయ్యానని, అయితే ఆ స్థాయి వ్యక్తి నుంచి ఎవరూ ఊహించని మాటలు రావడంతో అవాక్కయ్యానని తెలిపాడు. మొదటిసారి ధోనిని పూణే స్టేడియంలో కలిసినప్పుడు ఫిల్టర్ కాఫీ ఆఫర్ చేశాడని, ఆ తర్వాత జట్టు ప్రణాళికలు, వ్యూహ్యాల గురించి చర్చించాడని, అయితే ఊహించని విధంగా తనను మీటింగ్‌లకి రావాలని పిలవకండని వార్నింగ్ ఇచ్చాడని ఆరోపించాడు. అలాగే అడగనిదే సలహాలు ఇవ్వకండని తనతో చెప్పాడని అఘోరామ్ క్రిక్‌బజ్‌కు తెలిపాడు.
కాగా, ప్రసన్న అఘోరామ్ రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ ఛార్జర్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో పాటు సౌతాఫ్రికా జాతీయ జట్టుకు స్ట్రాటెజిక్ కోచ్‌గా పనిచేశాడు. అఘోరామ్ గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీ టెక్నికల్ హెడ్‌గా కూడా వ్యవహరించాడు. అఘోరామ్.. ధోని తరహా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం పడిన రెండేళ్లు (2016, 2017) ధోని రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలిసిందే.
చదవండి: ఒంటరివాడైన రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2022లో ఏకైక కెప్టెన్‌గా..!
Comments
Please login to add a commentAdd a comment