ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పెను సంచలనం నమోదైంది. టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్-సిలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా 2-1 తేడాతో అర్జెంటీనాపై సంచలన విజయం సాధించింది.
ఆట మొదలైన 9వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ గోల్‌గా మలిచి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి హాఫ్‌టైమ్‌లో పూర్తి ఆధిపత్యం చూపించిన అర్జెంటీనా రెండో అర్థభాగంలో మాత్రం సౌదీ అరేబియా పోరాటానికి తోక ముడిచింది. రెండో అర్థభాగం మొదలైన కాసేపటికే ఆట 47వ నిమిషంలో అల్ షెహ్రీ గోల్ చేయడంతో సౌదీ అరేబియా 1-1తో సమం చేసింది.
ఇక ఆట 57వ నిమిషంలో సలీమ్ అల్ దవాసరి అద్భుత గోల్ కొట్టాడు. పటిష్టమైన అర్జెంటీనా డిఫెన్స్‌ను చేధించుకొని టాప్ రైట్ కార్నర్ ఎండ్ నుంచి అద్భుత గోల్ కొట్టాడు. దీంతో సౌదీ అరేబియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడినుంచి అర్జెంటీనా పదేపదే సౌదీ అరేబియా గోల్ పోస్టుపై దాడి చేసినప్పటికి సఫలం కాలేకపోయింది. నిర్ణీత సమయం ముగిసేనాటికి 2-1తో సౌదీ అరేబియా ఆధిక్యంలో ఉంది. మరో 12 నిమిషాలు అదనపు సమయం కేటాయించినప్పటికి అర్జెంటీనా వచ్చిన అవకాశాలను జారవిడుచుకొని ఓటమి పాలైంది.
FULL-TIME | #ARGKSA @SaudiNT_EN pull off the first big upset of #FIFAWorldCupQatar2022 🤯
— JioCinema (@JioCinema) November 22, 2022
Presented by - @Mahindra_Auto #WorldsGreatestShow #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/AsMAGzIcw4
చదవండి: మెస్సీతో మాములుగా ఉండదు మరి..
Comments
Please login to add a commentAdd a comment