భారత్‌కు తొలి విజయం | First win for India | Sakshi

భారత్‌కు తొలి విజయం

Feb 10 2024 3:51 AM | Updated on Feb 10 2024 3:51 AM

First win for India - Sakshi

భువనేశ్వర్‌: మహిళల ప్రొ లీగ్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భారత మహిళల జట్టు నాలుగో మ్యాచ్‌లో విజయం రుచి చూసింది. అమెరికా జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సవితా పూనియా బృందం 3–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున వందన కటారియా (9వ ని.లో), దీపిక (26వ ని.లో), సలీమా టెటె (56వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

అమెరికా జట్టుకు సేన్‌ కార్ల్స్‌ (42వ ని.లో) ఏకైక గోల్‌ అందించింది. భారత జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు, అమెరికా జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయితే రెండు జట్లు ఈ పెనాల్టీ కార్నర్‌లను వృథా చేశాయి. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో భారత్‌ మూడు పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. సోమవారం జరిగే ఐదో మ్యాచ్‌లో చైనాతో భారత్‌ ఆడుతుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement