Former BCCI Chief Selector Chetan Sharma Cryptic Post Goes Viral, Says Life Has Been Very Tough So Far - Sakshi
Sakshi News home page

చాలా కష్టంగా ఉంది.. ఒక్కరూ సాయం చేయడం లేదు.. కనీసం: చేతన్‌ శర్మ ట్వీట్‌ వైరల్‌

Published Thu, May 18 2023 2:21 PM | Last Updated on Thu, May 18 2023 3:26 PM

Former BCCI Chief Selector Chetan Sharma Cryptic Post: Life Very Tough So Far - Sakshi

Chetan Sharma shares cryptic post: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మాజీ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ నెట్టింట మరోసారి వైరల్‌గా మారాడు. ఎవరూ సహకారం అందించడం లేదంటూ నర్మగర్భ ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2022లో టీమిండియా పరాభవం నేపథ్యంలో చేతన్‌ శర్మ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీని బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో అనూహ్య రీతిలో మరోసారి చేతన్‌ శర్మనే చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. శివ్‌సుందర్‌ దాస్‌, సుబ్రతో బెనర్జీ, సలీల్‌ అంకోలా, శ్రీధరన్‌ శరత్‌కు చేతన్‌ శర్మ పానెల్‌లో చోటిచ్చింది. 

సంచలన వ్యాఖ్యలతో వివాదంలో
ఇదిలా ఉంటే.. చీఫ్‌ సెలక్టర్‌గా మరోసారి నియమితుడైన చేతన్‌ శర్మ నెల రోజుల్లోనే వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ చానెల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో చేతన్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. భారత క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించనప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారంటూ సంచలనం రేపాడు. 

అదే విధంగా సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి వ్యతిరేకంగా రాజకీయాలు జరిగాయంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో టీమిండియా ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీసేలా మాట్లాడిన చేతన్‌ శర్మ రాజీనామా చేయడం కూడా చర్చకు దారితీసింది. 

ఒక్కరు కూడా సాయం చేయడం లేదు
ఈ నేపథ్యంలో చేతన్‌ శర్మను తప్పించాలనే ఉద్దేశంతో బీసీసీఐ పెద్దలే ఈ స్టింగ్‌ ఆపరేషన్‌కు ప్రణాళికలు రచించారనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. తాజాగా ఓ క్రిప్టిక్‌ పోస్ట్‌తో చేతన్‌ శర్మ ముందుకు వచ్చాడు. ‘‘ఇప్పటిదాకా గడిచిన జీవితం చాలా కష్టంగా తోచింది.

స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఎలాంటి సహకారం లేదు. ఆ మాతా రాణి ఆశీర్వాదాలైనా నాపై ఉంటాయని ఆశిస్తున్నా’’ అని చేతన్‌ శర్మ ట్వీట్‌ చేశాడు. ఇందుకు స్పందించిన ఆయన ఫాలోవర్లు.. ‘‘ధైర్యంగా ఉండండి. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నీకు గడ్డు దశ నడుస్తుంది కావొచ్చు. కానీ ఏదో ఒ‍కరోజు నీ సమస్యలు తీరిపోతాయి భాయ్‌’’ అని అండగా నిలుస్తున్నారు.

చదవండి: యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. శ్రీలంక క్రికెటర్‌కు ఊరట 
చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement