F2 రేసులో ఘోర ప్రమాదం: భారత డ్రైవర్‌కు తప్పిన ముప్పు | Formula 2: Indian Driver Kush Maini Escapes Serious Injury In Baku Crash | Sakshi
Sakshi News home page

F2 రేసులో ఘోర ప్రమాదం: భారత డ్రైవర్‌కు తప్పిన ముప్పు

Published Mon, Sep 16 2024 1:19 PM | Last Updated on Mon, Sep 16 2024 1:42 PM

Formula 2: Indian Driver Kush Maini Escapes Serious Injury In Baku Crash

PC: X

ఫార్మాలా 2 రేసు సందర్భంగా భారత డ్రైవర్‌ కుశ్‌ మైనీకి పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ పెనాల్టీ నుంచి తప్పించుకోలేకపోయాడు. కాగా ఫార్ములావన్‌ అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేస్‌కు ముందు ఫార్ములా2 ఫీచర్‌ రేస్‌ను నిర్వహిస్తారు. ఇందులో..  23 ఏళ్ల కుశ్‌ ‘ఇన్‌విక్టా రేసింగ్‌’ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, రేస్‌ మొదలయ్యే సమయానికి అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

కార్లు చిన్నాభిన్నం 
రేస్‌ ఆరంభంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పొరపాటుతో కార్లు ఢీకొని ప్రమాదం జరిగింది. రేస్‌ స్టార్ట్‌ లైన్‌ వద్ద ఇంజిన్‌లో సమస్య ఏర్పడటంతో కుశ్‌ కారు స్టార్ట్‌ కాకుండానే ఆగిపోయింది. దాంతో వెనుక నుంచి దూసుకొచ్చిన ఇతర డ్రైవర్లు జోసెఫ్‌ మారియా, ఒలీవర్‌ గోత్‌లను ఇది గందరగోళానికి గురి చేసింది. ఆ రెండు కార్లూ తీవ్ర వేగంతో వచ్చి కుశ్‌ కారును బలంగా ఢీకొట్టాయి. ఆ తాకిడికి కార్లు చిన్నాభిన్నం అయ్యాయి.

ఐదు స్థానాలు పెనాల్టీగా
కారులో ఉన్న కుశ్‌ అదృష్టవశాత్తూ బయటకు రాగలిగాడు. అనంతరం అతడికి వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రమాదం లేదని నిర్ధారించారు. అయితే, రేసు ముగిసిన తర్వాత ఎఫ్‌2 నిర్వాహకులు కుశ్‌పై చర్యలు తీసుకున్నారు. ప్రతీ రేసుకు ముందు జరిగే ‘స్టార్ట్‌ సెటప్‌ ప్రొసీజర్‌’ను సరిగా పాటించకుండా గ్రిడ్‌పై ప్రమాదానికి కారణమైనందుకు అతనిపై 10 సెకన్ల పెనాల్టీ విధించారు. అయితే కుశ్‌ ఈ రేస్‌ను పూర్తి చేయలేదు కాబట్టి ఈ శిక్షను మారుస్తూ ‘ఐదు స్థానాలు పెనాల్టీ’గా విధించారు. కుశ్‌ పాల్గొనే తర్వాతి రేసులో ఈ శిక్ష అమలవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement