గుజరాత్ స్టార్ ఆల్‌రౌండర్ రూష్ కలారియా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. కలారియా తన రిటైర్మెంట్ విషయాన్ని శనివారం గుజరాత్ క్రికెట్ ఆసోషియేషన్‌కు తెలియజేశాడు. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, గుజరాత్ క్రికెట్ ఆసోషియేషన్‌కు కలారియా ధన్యవాదాలు తెలిపాడు. కలారియా 2012 అండర్-19 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ జట్టుకు ఉన్ముక్త్ చంద్ సారధ్యం వహించాడు.
అదే విధంగా ఐపీఎల్-2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో కూడా ఈ ఆల్‌రౌండర్ భాగమయ్యాడు. యూఏఈ వేదికగా జరిగిన ఆ సీజన్‌లో ముంబైకు బ్యాకప్ ప్లేయర్‌గా కలారియా ఉన్నాడు. కాగా 2012 రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌పై కలారియా తన ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇక తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 56 మ్యాచ్‌లు ఆడిన కలారియా 173 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2015-16 విజయ్ హాజారే ట్రోఫీ, 2013-15 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా కలారియా ఆడాడు.
చదవండి: IND vs WI: అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment