రజత పతకంతో చరిత్ర సృష్టించిన భవీనా పటేల్‌కు స్వరాష్ట్రం గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ‘దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్’లో భాగంగా భవీనాకు రూ. 3 కోట్లు అందజేయనున్నట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‘భవీనాకు అభినందనలు. మీ అద్భుత ప్రదర్శనతో యావత్ దేశం గర్వపడుతోంది’ అని గుజరాత్ సీఎం విజయ్ రుపానీ కొనియాడారు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య భవీనాకు రూ. 31 లక్షల నజరానా అందజేయనున్నట్లు పేర్కొంది. మరోవైపు భవీనాకు త్వరలో మార్కెట్‌లో విడుదల కానున్న ఆస్టర్ ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎంజీమోటార్స్ ప్రకటించింది.
సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల్లో కలిపి భారత్ తరఫున పతకం గెలిచిన తొమ్మిదో మహిళా క్రీడాకారిణి భవీనా. సమ్మర్ ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్; 2000 సిడ్నీ–కాంస్యం), సైనా (బ్యాడ్మింటన్; 2012 లండన్–కాంస్యం), మేరీకోమ్ (బాక్సింగ్; 2012 లండన్–కాంస్యం), సింధు (బ్యాడ్మింటన్; 2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం), సాక్షి మలిక్ (రెజ్లింగ్; 2016 రియో–కాంస్యం), మీరాబాయి (వెయిట్‌లిఫ్టింగ్; 2020 టోక్యో–రజతం), లవ్లీనా (బాక్సింగ్; 2020 టోక్యో–కాంస్యం)... పారాలింపిక్స్ లో దీపా మలిక్ (షాట్‌పుట్; 2016 రియో–రజతం) పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment