Bhavinaben Patel
-
CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో శనివారం భారత స్టార్ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ మహిళల సింగిల్స్ 3-5తో స్వర్ణ పతకం సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల యువకుడు 12-10 11-2 11-9తో నైజీరియాకు చెందిన ఇఫెచుక్వుడే క్రిస్టియానా ఇక్‌పెయోయ్‌పై విజయం సాధించి క్వాడ్రినియెల్ ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఇక సోనాల్‌బెన్ మనుభాయ్ పటేల్ కూడా మహిళల సింగిల్స్ క్లాస్‌లో 3-5తో కాంస్యం సాధించి భారత్‌కు పతకాన్ని అందించింది. 34 ఏళ్ల భారత ఆటగాడు కాంస్య పతక ప్లే ఆఫ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన స్యూ బెయిలీపై 11-5 11-2 11-3 తేడాతో విజయం సాధించారు. అయితే, పురుషుల సింగిల్స్ తరగతుల్లో రాజ్ అరవిందన్ అళగర్ 0-3తో నైజీరియాకు చెందిన ఇసౌ ఒగున్‌కున్లే చేతిలో 3-5తో కాంస్య పతక ప్లే-ఆఫ్‌తో ఓడిపోయాడు. కాగా కామన్వెల్త్ గేమ్మ్ తొమ్మిదో రోజు భారత్ మూడు స్వర్ణాలు సాధించింది. పలు కాంస్య పతకాలు గెలుచుకుంది. మొత్తం ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత్ 40 మెడల్స్‌తో ఐదో స్థానంలో ఉండగా.. అందులో 13 స్వర్ణం, 11 రజతం, 16 కాంస్యం ఉన్నాయి. Our country is constantly being brought up with the stellar performance of Indian sports talent in #CommonwealthGames2022. In this sequence, in the Para Table-Tennis match, Gujarat's pride, Bhavinaben Patel, won the GOLD🏅medal and made the nation proud. You are a champion 👏 pic.twitter.com/ANWtyMiksA — Sports Authority of Gujarat (@sagofficialpage) August 6, 2022 చదవండి: Commonwealth Games 2022: ‘పసిడి’కి పంచ్ దూరంలో... -
భవీనాకు గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా
రజత పతకంతో చరిత్ర సృష్టించిన భవీనా పటేల్‌కు స్వరాష్ట్రం గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ‘దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్’లో భాగంగా భవీనాకు రూ. 3 కోట్లు అందజేయనున్నట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‘భవీనాకు అభినందనలు. మీ అద్భుత ప్రదర్శనతో యావత్ దేశం గర్వపడుతోంది’ అని గుజరాత్ సీఎం విజయ్ రుపానీ కొనియాడారు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య భవీనాకు రూ. 31 లక్షల నజరానా అందజేయనున్నట్లు పేర్కొంది. మరోవైపు భవీనాకు త్వరలో మార్కెట్లో విడుదల కానున్న ఆస్టర్ ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎంజీమోటార్స్ ప్రకటించింది. సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల్లో కలిపి భారత్ తరఫున పతకం గెలిచిన తొమ్మిదో మహిళా క్రీడాకారిణి భవీనా. సమ్మర్ ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్; 2000 సిడ్నీ–కాంస్యం), సైనా (బ్యాడ్మింటన్; 2012 లండన్–కాంస్యం), మేరీకోమ్ (బాక్సింగ్; 2012 లండన్–కాంస్యం), సింధు (బ్యాడ్మింటన్; 2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం), సాక్షి మలిక్ (రెజ్లింగ్; 2016 రియో–కాంస్యం), మీరాబాయి (వెయిట్‌లిఫ్టింగ్; 2020 టోక్యో–రజతం), లవ్లీనా (బాక్సింగ్; 2020 టోక్యో–కాంస్యం)... పారాలింపిక్స్ లో దీపా మలిక్ (షాట్‌పుట్; 2016 రియో–రజతం) పతకాలు సాధించారు. -
Bhavinaben Patel: రజత సంబరం
జాతీయ క్రీడా దినోత్సవాన టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఒకేరోజు ఏకంగా మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ పటేల్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–47 విభాగంలో నిశాద్ కుమార్ కూడా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో భారత ప్లేయర్ వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. అయితే వినోద్‌తో పోటీపడిన ప్రత్యర్థులు అతడి వైకల్యం స్థాయిపై సందేహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. దాంతో డిస్కస్ త్రో ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పతకాల ప్రదానోత్సవాన్ని నేటికి వాయిదా వేశారు. నేడు ఫిర్యాదుపై విచారించి వినోద్‌కు పతకం ఇవ్వాలా వద్దా అనేది నిర్వాహకులు తేలుస్తారు. టోక్యో: ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్‌కు నిరాశ ఎదురైంది. టోక్యో పారాలింపిక్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన టీటీ మహిళల సింగిల్స్ క్లాస్–4 విభాగం ఫైనల్లో భవీనాబెన్ పటేల్ 7–11, 5–11, 6–11తో ప్రపంచ నంబర్‌వన్ యింగ్ జౌ (చైనా) చేతిలో ఓడిపోయింది. 19 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యింగ్ జౌ నిలకడగా పాయింట్లు స్కోరు చేసింది. లీగ్ దశలోనూ యింగ్ జౌతో జరిగిన మ్యాచ్‌లో భవీనా పరాజయం చవిచూసింది. ఓవరాల్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడిన గుజరాత్‌కు చెందిన 34 ఏళ్ల భవీనా అబ్బురపరిచే ఆటతీరుతో ఎవరూ ఊహించని విధంగా రజత పతకాన్ని సాధించింది. రజత పతకం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. అయితే పతకం స్వర్ణమై ఉంటే ఇంకా సంతోషం కలిగేది. తమ సామర్థ్యంపై నమ్మకం ఉంటే మహిళలు ఎన్నో అద్భుతాలు చేయగలరు. రియో పారాలింపిక్స్‌కు అర్హత సాధించినా సాంకేతిక కారణాలతో నేను ఆ క్రీడలకు దూరమయ్యాను. ‘రియో’లో చేజారిన అవకాశం నాలో కసిని పెంచింది. పతకం గెలిచేందుకు దోహదపడింది. వైకల్యం కారణంగా నేను జీవితంలో పడిన ఇబ్బందులు తర్వాతి తరంవారు ఎదుర్కోకూడదని కోరుకుంటున్నాను. దైనందిన జీవితంలో దివ్యాంగులకు ప్రతి చోటా క్లిష్ట పరిస్థితులే ఎదురవుతాయి. ఉద్యోగాలతోపాటు ఇతర రంగాల్లోనూ వారికి సముచిత స్థానం ఇవ్వాలి. నా పతకం ద్వారా దివ్యాంగులకు ఏదైనా మేలు జరిగితే అంతకంటే సంతోషం మరోటి ఉండదు. –భవీనాబెన్ పటేల్ విశేష ప్రదర్శనతో భవీనా చరిత్ర లిఖించింది. దేశానికి రజతం అందించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. యువతను క్రీడలవైపు ఆకర్షించేలా చేస్తుంది. –ప్రధాని మోదీ -
భవీనా పటేల్‌కు రజతం.. ప్రముఖుల ప్రశంసల వెల్లువ
ఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన భవీనాబెన్ పటేల్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రధాని, రాష్ట్రపతి మొదలుకొని పలువురు సెలబ్రిటీలు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రజతం సాధించిన భవీనా పటేల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో పారాలింపిక్స్ 2020 లో కృషి, పట్టుదల, సంకల్పంతో రజత పతకం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భావినాబెన్ పటేల్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. పటేల్ తన అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేసారన్నారు. టోక్యో పారాలింపిక్స్ క్రీడలలో టేబుల్ టెన్నిస్‌లో ఆమె సాధించిన రజత పతకం దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గవర్నర్ అన్నారు. చదవండి: పారాలింపిక్స్‌లో భవీనా కొత్త అధ్యాయం.. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ► పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన భవీనా.. భారత బృధానికి, క్రీడాభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ అసాధారణ సంకల్పం, నైపుణ్యాలు భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. మీకు నా అభినందనలు - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ President Ram Nath Kovind wishes Para table tennis player #BhavinaPatel on winning a Silver medal at Tokyo Paralympics "...Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement," he says. pic.twitter.com/E59vmq82IY — ANI (@ANI) August 29, 2021 ► భవీనా పటేల్ చరిత్ర లిఖించింది. దేశానికి ఆమె చారిత్రక సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ప్రయాణం యువతను క్రీడలవైపు ఆకర్షిస్తుంది - ప్రధాని నరేంద్ర మోదీ PM Modi congratulates Para-paddler Bhavina Patel on winning a Silver medal at Tokyo Paralympics "The remarkable Bhavina Patel has scripted history! ...Her life journey is motivating and will also draw more youngsters towards sports," he says. pic.twitter.com/CDlW1KS5d7 — ANI (@ANI) August 29, 2021 ► టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను - ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #Paralympics pic.twitter.com/89CCkOUhR6 — Vice President of India (@VPSecretariat) August 29, 2021 -
పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం
-
శెబ్బాష్ భవీనా.. ఈమె జీవితం నేర్చుకోవాల్సిన పాఠం
Bhavina Patel Wins Silver Medal: తొందరపడితే చరిత్రను తిరగరాయలేం.. ఊరికే చరిత్రను సృష్టించలేం.. ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా డైలాగ్. అయితే నిజ జీవితంలోనూ ఇది అక్షర సత్యమని నిరూపించింది భవీనాబెన్ పటేల్. టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో తొలి పతకం(రజతం) సాధించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్.. అందుకోసం పడ్డ కష్టం, గెలుపు కోసం పడ్డ తాపత్రయం ఎందరికో స్ఫూర్తిదాయకం కూడా.. సాక్షి, వెబ్‌డెస్క్: టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ మహిళ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. సెమీస్‌లో చేరినప్పుడే ఆమెకు పతకం ఖాయమైనప్పటికీ శనివారం జరిగిన సెమీస్ పోరులో గెలిచిన భవీనా ఫైనల్‌కు అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో గెలిస్తే బంగారు పతకాన్ని గెలిచే అవకాశం వచ్చింది. అయితే తుది పోరులో చైనా క్రీడాకారిణి.. ప్రపంచ నెంబర్‌వన్.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్ పటేల్ జీవితం ఒక ఆదర్శం. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ఒడిదుడుకులతో విజయాలు సాధించింది. చదవండి: Tokyo Paralympics: భవీనాబెన్ పటేల్‌కు రజతం An accomplishment that will echo through #IND 🗣️ Bhavina Patel receives her medal as she wins the nation's first #silver in #ParaTableTennis at the #Tokyo2020 #Paralympics ❤️pic.twitter.com/l4xzgHpYWK — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021 పోలియో బారిన పడి... గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్‌లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్‌కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్‌ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. ప్రస్తుతం ఆమె సాధించిన విజయానికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. -
Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల టేబుల్ టెన్నిస్ ఫైనల్లో ఓడిన భవీనాబెన్ పటేల్ రజతం గెలిచింది. ఫైనల్లో నంబర్‌వన్.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. అయితే పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే మొదటిసారి. పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భవీనాబెన్ పటేల్‌ను అభినందించారు. చదవండి: సీజన్లో తొలి టైటిల్‌కు విజయం దూరంలో... గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. చదవండి: మూడో టెస్టులో టీమిండియా పరాభవం -
Paralympics 2021: చరిత్రకు చేరువలో...
ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటివరకు భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా) వ్యక్తిగత విభాగాలలో స్వర్ణ పతకాలు గెలిచారు. విశ్వ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించేందుకు టీటీ ప్లేయర్ భవీనాబెన్ పటేల్‌కు స్వర్ణావకాశం దక్కింది. టోక్యో పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్లాస్–4 మహిళల సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. చైనా ప్లేయర్ యింగ్ జౌతో నేడు జరిగే తుది పోరులో భవీనా గెలిస్తే బంగారు పతకంతో కొత్త చరిత్ర లిఖిస్తుంది. టోక్యో: ఏమాత్రం అంచనాలు లేకుండా టోక్యో పారాలింపిక్స్ బరిలోకి దిగిన భారత మహిళా టీటీ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ పసిడి కాంతులు విరజిమ్మేందుకు విజయం దూరంలో నిలిచింది. తొలిసారి విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న 34 ఏళ్ల ఈ గుజరాతీ మహిళ తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను బోల్తా కొట్టిస్తూ ఏకంగా పసిడి పతకం పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన క్లాస్–4 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భవీనా 7–11, 11–7, 11–4, 9–11, 11–8 తో 2012 లండన్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, 2014 ప్రపంచ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ మియావో జాంగ్ (చైనా)పై నెగ్గింది. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే ఫైనల్లో చైనాకే చెందిన వరల్డ్ నంబర్‌వన్ యింగ్ జౌతో భవీనాబెన్ తలపడుతుంది. తుది పోరులో గెలిస్తే భవీనాబెన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. రెండో సెమీఫైనల్లో యింగ్ జౌ 11–4, 11–3, 11–6తో జియోడాన్ జు (చైనా)పై గెలిచింది. చదవండి: వెర్స్టాపెన్ ‘పోల్’ సిక్సర్ లెక్క సరిచేసింది... గతంలో మియావో జాంగ్‌తో ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భవీనాబెన్ ఈసారి మాత్రం అదరగొట్టింది. తొలి గేమ్‌ను కోల్పోయినా నిరాశ చెందకుండా ఆడిన భవీనా రెండో గేమ్‌ను, మూడో గేమ్‌ను సొంతం చేసుకొని 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో గేమ్‌లో మియావో గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో గేమ్‌లో భవీనాబెన్ ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఆడింది. 9–5తో ఆధిక్యంలోకి వచ్చి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే మియావో వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించింది. అయితే కీలకదశలో భవీనాబెన్ నిగ్రహం కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. చదవండి: మూడో టెస్టులో భారత్‌కు పరాభవం రాకేశ్ ముందంజ... మరోవైపు పురుషుల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. రాకేశ్ కుమార్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... శ్యామ్ సుందర్ స్వామి రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆడిన రాకేశ్ కుమార్ 144–131తో కా చుయెన్ ఎన్గాయ్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో శ్యామ్ 139–142తో మ్యాట్ స్టుట్జ్మన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రంజీత్ విఫలం... పురుషుల అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఎఫ్–57 కేటగిరీ లో భారత ప్లేయర్ రంజీత్ భాటి నిరాశపరిచాడు. రంజీత్ తన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా సఫలం కాలేకపోయాడు. రంజీత్ ఆరు త్రోలూ ఫౌల్ కావడంతో ఫైనల్లో పాల్గొన్న 12 మందిలో అతను చివరి స్థానంలో నిలిచాడు. పతకం గురించి ఆలోచించకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతోనే నేను టోక్యో పారాలింపిక్స్ బరిలోకి దిగాను. వందశాతం శ్రమిస్తే తప్పకుండా పతకం వస్తుందని భావించాను. ఇదే ఆత్మవిశ్వాసంతో ఫైనల్లోనూ పోరాడితే స్వర్ణం గెలుస్తానని నమ్మకంతో ఉన్నాను. పోలియో కారణంగా నా కాళ్లు అచేతనంగా మారిపోయినా ఏనాడూ నేను దివ్యాంగురాలిననే ఆలోచన మనసులోకి రానీయలేదు. చైనా క్రీడాకారిణులను ఓడించడం అంత సులువు కాదని చెబుతుంటారు. కానీ పట్టుదలతో పోరాడితే ఎంతటి మేటి క్రీడాకారిణులనైనా ఓడించగలమని నిరూపించాను. –భవీనా పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ మహిళల ఆర్చరీ కాంపౌండ్ ఎలిమినేషన్ రౌండ్: జ్యోతి X కెరీ (ఐర్లాండ్); ఉ. గం. 6:55 నుంచి మహిళల టేబుల్ టెన్నిస్ క్లాస్–4 సింగిల్స్ ఫైనల్: భవీనా X యింగ్ జౌ (చైనా); ఉ. గం. 7:15 నుంచి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ప్రిక్వార్టర్ ఫైనల్: భారత్ X థాయ్‌లాండ్; ఉదయం గం. 9 నుంచి అథ్లెటిక్స్ పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–52 ఫైనల్: వినోద్ కుమార్; మధ్యాహ్నం గం. 3:54 నుంచి. అథ్లెటిక్స్ పురుషుల హైజంప్ ఎఫ్–47 ఫైనల్: నిశాద్, రామ్‌పాల్; మధ్యాహ్నం గం. 3:58 నుంచి. దూరదర్శన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Tokyo Paralympics: టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌కు భవీనాబెన్
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్ మియావోను 3-2 తేడాతో ఓడించింది. ఈ విజయంతో భవానిబెన్ దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భవీనాబెన్ సెమీఫైనల్లో ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. చైనాకు చెందిన జాంగ్ మియావోను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో ఓడించింది. దాదాపుగా 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపించింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐతే మంచి లయలో ఉన్న ఆమె వెంటనే పుంజుకుంది. వరుసగా రెండు గేములు కైవసం చేసుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో గేమ్‌ను ఆమె కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా... గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది.