Netizens Trolls On Hardik Pandya And Natasa For Sharing Bold Photos From Thailand Trip - Sakshi
Sakshi News home page

Hardik Pandya: భార్యతో టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా.. ఫొటోలు వైరల్‌! ఎందుకిలా..?

Published Wed, Jun 28 2023 8:23 PM | Last Updated on Thu, Jun 29 2023 12:09 PM

Hardik Pandya Natasa Bold Photos Hit Viral Button Mercilessly Troll - Sakshi

Hardik Pandya And Natasa Stankovic: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘మీ పద్ధతి బాగాలేదు.. అందరి ముందు ఇలాంటివి అవసరమా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2023లో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

వర్షం కారణంగా ఫైనల్‌ రిజర్వ్‌ డే జరుగగా.. అహ్మదాబాద్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైంది. దీంతో వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలనుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక తుదిపోరులో టైటాన్స్‌ను ఓడించిన ధోని సేన ఐదోసారి చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది.

ఇదిలా ఉంటే.. క్యాష్‌రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ ముగిసిన తర్వాత హార్దిక్‌ పాండ్యాకు కావాల్సినంత విరామ సమయం దొరికింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడేందుకు రోహిత్‌ సేన లండన్‌కు వెళ్లగా.. ఈ ఆల్‌రౌండర్‌కు రెస్ట్‌ లభించింది. దీంతో తన సమయాన్నంతా కుటుంబానికే కేటాయించాడు.

ఇందులో భాగంగా భార్య నటాషా స్టాంకోవిక్‌, కుమారుడు అగస్త్యతో కలిసి థాయ్‌లాండ్‌ ట్రిప్‌నకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటాషా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తాజాగా ఆమె పంచుకున్న చిత్రాలే పాండ్యా దంపతులపై నెటిజన్ల ట్రోలింగ్‌కు కారణమయ్యాయి. 

హార్దిక్‌- నటాషా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలపై కొంతమంది ఆకతాయిలు విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు?’’ అంటూ ముఖ్యంగా నటాషా డ్రెస్సింగ్‌ను తప్పుపడుతున్నారు. 

అయితే, పాండ్యా అభిమానులు మాత్రం.. ‘‘వాళ్లు భార్యాభర్తలు. ఎలా ఉంటే మీకేంటి? నటాషా వేసుకున్న డ్రెస్‌పై మీ అభ్యంతరాలేమిటి? పని చూసుకోండి’’ అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. కాగా జూలై 12 నుంచి మొదలుకానున్న వెస్టిండీస్‌ టూర్‌తో హార్దిక్‌ పాండ్యా మళ్లీ బిజీ కానున్నాడు. ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ శర్మ వారసుడు,  భవిష్యత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

చదవండి: టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు! అసలు రహానే ఏం చేశాడని ఆ బాధ్యతలు?
మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్‌ బరువు! అందుకే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement