Harmanpreet Kaur turns up with glasses at post match presentation - Sakshi
Sakshi News home page

T20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా'

Published Fri, Feb 24 2023 11:17 AM | Last Updated on Fri, Feb 24 2023 11:46 AM

Harmanpreet Kaur turns up with glasses at post match presentation - Sakshi

మహిళల టీ20 ప్రపంచకప్‌-2023 టీమిండియా కథ ముగిసింది. కేప్‌టౌన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో 5 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడనప్పటికీ.. ఓటమి మాత్రం భారత్‌ పక్షానే నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది.

ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హర్మన్‌ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించింది. అయితే కీలక సమయంలో హర్మన్‌ దురదృష్టకర రీతిలో రనౌట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్‌ భారత్‌ చేజారిపోయింది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 52 పరుగులు చేసింది.  ఇక ఈ మ్యచ్‌ అనంతరం హర్మన్‌ప్రీత్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యంది. మైదానంలోనే హర్మన్‌ కన్నీరు పెట్టుకుంది. భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చింది.

ఇక మ్యాచ్‌ ప్రెజెంటేషన్ సమయంలో సన్‌గ్లాసెస్‌ పెట్టుకుని హర్మన్‌ కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రెజెంటేటర్‌ అద్దాలు ఎందుకు ధరించారని హర్మన్‌ను ప్రశ్నించాడు. అందుకు బదులుగా.. "నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదనుకుంటున్నాను. అందుకే నేను ఈ అద్దాలు ధరించాను. మేము కచ్చితంగా మెరుగవుతాం. మరోసారి దేశాన్ని నిరాశపర్చబోమని నేను మాటిస్తున్నాను" అని హర్మన్‌ప్రీత్‌ సమాధానమిచ్చింది.
చదవండిENG vs NZ: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement