చెపాక్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహమూద్ సత్తాచాటాడు. మహమూద్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి అదరహో అన్పించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, గిల్, పంత్ వంటి వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు.
తన కెరీర్‌లో కేవలం నాలుగో టెస్టు మాత్రమే ఆడుతున్న ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్.. తన పేస్ బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కాగా టెస్టు క్రికెట్‌లో హసన్ ఐదు వికెట్ల ఘనత సాధించడం ఇది రెండుసారి కావడం గమనార్హం. ఈ సిరీస్ కంటే ముందు పాక్‌తో జరిగిన రెండో హసన్ ఐదు వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 18 వికెట్లు
హసన్ అరుదైన ఘనత..
ఇక ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన హసన్ మహమూద్ ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై టెస్టుల్లో 5 వికెట్ల హాల్ సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా హసన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ బంగ్లా బౌలర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.
ఓవరాల్‌గా భారత్‌పై 5 వికెట్ల ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా హసన్ నిలిచాడు. ఈ జాబితాలో నైమూర్ రెహమాన్, షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్,షహదత్ హుస్సేన్, హసన్ మహమూద్ ఉన్నారు.
చదవండి: Eng Vs Aus: లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment