
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం సొంత మైదానం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో గోవా ఎఫ్‌సీని ఓడించింది.
హైదరాబాద్ తరఫున ఏకైక గోల్‌ను సివెరియో 11వ నిమిషంలో నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన హైదరాబాద్ తర్వాతి మూడు మ్యాచ్‌లలో గెలిచింది.
చదవండి: T20 WC 2022: పాకిస్తాన్ - నెదర్లాండ్స్ మ్యాచ్.. కామెంటేటర్‌గా మిథాలీ రాజ్
Comments
Please login to add a commentAdd a comment