Womens WC 2022 Ind W Vs WIW: Smriti Mandhana Scored Her Fifth ODI Century, Deets Inside - Sakshi
Sakshi News home page

Smriti Mandhana: మంధాన క్లాసీ సెంచరీ.. వన్డేల్లో ఎన్నోదంటే!

Published Sat, Mar 12 2022 9:44 AM | Last Updated on Sat, Mar 12 2022 1:34 PM

ICC Women ODI World Cup 2022 Ind W Vs WIW: Smriti Mandhana Classy Century - Sakshi

ICC Women ODI World Cup 2022 Ind W Vs WIW- Smriti Mandhana Classy Century: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. న్యూజిలాండ్‌ వేదికగా వెస్టిండీస్‌ మహిళా జట్టుతో మ్యాచ్‌లో శతకం బాదింది. ఈ క్రమంలో వన్డేల్లో తన ఐదో సెంచరీ నమోదు చేసింది. 

ఈ మ్యాచ్‌లో మొత్తంగా 119 బంతులు ఎదుర్కొన్న మంధాన 123 పరుగులు (13 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసింది. ఫోర్‌ బాది శతకం పూర్తి చేసుకోవడం విశేషం. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో కలిసి నిలకడగా ఆడుతూ భారత జట్టు భారీ ఇన్నింగ్స్‌ సాధించడంలో మంధానది కీలక పాత్ర.

ఈ నేపథ్యంలో మంధానకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుత ఇన్నింగ్స్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖ కామెంటేటర్‌ హర్షా బోగ్లే.. ‘‘స్మృతి మంధాన నుంచి అద్భుత ఇన్నింగ్స్‌.. సో క్లాసీ.. చూడముచ్చటగా అనిపించింది’’ అంటూ ఆమెను కొనియాడాడు. 


చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఆసీస్‌ కెప్టెన్‌.. ఐపీఎల్లోకి రీఎంట్రీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement