Ind vs Afg T20I Series 2024- Virat Kohli Re-Entry: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అంతర్జాతీయ టీ20లలో తన బ్యాటింగ్ మెరుపులు చూడాలనుకున్న వాళ్ల నిరీక్షణను పొడిగించే నిర్ణయం తీసుకున్నాడు. అఫ్గనిస్తాన్‌తో తొలి టీ20కి అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు.
అప్పటి నుంచి దూరంగానే
కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున కోహ్లి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే. ఆ టోర్నీలో భారత్ సెమీస్‌లోనే నిష్క్రమించిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌తో టీ20లలో టచ్‌లోనే ఉన్నా.. టీమిండియా తరఫున మాత్రం సిరీస్‌లు ఆడలేదు.
యువ ఆటగాళ్లకు ఛాన్స్
ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లి గైర్హాజరీలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి ఐపీఎల్ సంచలనాలు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నారు. కీలక సమయంలో తమను తాము నిరూపించుకుని టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
అయితే, స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయాల కారణంగా దూరం కావడంతో.. సెలక్టర్లు రోహిత్- కోహ్లితో చర్చలు జరిపినట్లు సమాచారం. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా రంగంలోకి దిగి వీరిద్దరిని పునరాగమనానికి ఒప్పించినట్లు వార్తలు వచ్చాయి.
అందుకే తొలి టీ20కి కోహ్లి దూరం: ద్రవిడ్
అందుకు తగ్గట్లుగానే అఫ్గన్‌తో సిరీస్‌కు ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లు కనిపించాయి. వీరి రీ ఎంట్రీని కొందరు మాజీలు సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 11 నుంచి ఈ సిరీస్ మొదలు కానున్న విషయం తెలిసిందే.
అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి తొలి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాకు వెల్లడించాడు. ఆఖరి రెండు టీ20లకు అతడు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. అయితే, రోహిత్ శర్మ మాత్రం ఆది నుంచే ఈ సిరీస్‌లో భాగమవుతాడని ఈ సందర్భంగా ద్రవిడ్ పేర్కొన్నాడు.
చదవండి: Ind vs Afg: బీసీసీఐతో ఇషాన్ కిషన్‌కు విభేదాలా? అందుకే సెలక్ట్ చేయలేదా?!
Comments
Please login to add a commentAdd a comment