చెలరేగిన టీమిండియా బౌలర్‌.. 136 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌ | INDW VS ENGW Only Test: Deepti Sharma Claims One Of The Best Bowling Figures In Womens Test History | Sakshi
Sakshi News home page

చెలరేగిన టీమిండియా బౌలర్‌.. 136 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌

Published Fri, Dec 15 2023 3:15 PM | Last Updated on Fri, Dec 15 2023 3:15 PM

INDW VS ENGW Only Test: Deepti Sharma Claims One Of The Best Bowling Figures In Womens Test History - Sakshi

నవీ ముంబై వేదికగా ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళా జట్టు పట్టు బిగించింది. బ్యాటర్లంతా తలో చేయి వేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్‌ చేసిన భారత్‌.. అనంతరం ప్రత్యర్ధిని 138 పరుగులకే ఆలౌట్‌ చేసి 292 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందింది. దీప్తి శర్మ టెస్ట్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు (5.3-4-7-5) నమోదు చేసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించింది.

దీప్తికి స్నేహ్‌ రాణా (2/25), రేణుక సింగ్‌ (1/32), పూజా వస్త్రాకర్‌ (1/39) సహకరించారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (59) టాప్‌ స్కోర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు. ఆమీ జోన్స్‌ 12, బేమౌంట్‌ 10, డంక్లీ 11, హీథర్‌ నైట్‌ 11, డేనియెల్‌ వ్యాట్‌ 19 పరుగులు చేయగా.. లారెన్‌ ఫైలర్‌ 5, కేట్‌ క్రాస్‌ ఒకటి, ఎక్లెస్టోన్‌, చార్లీ డీన్‌ డకౌట్లయ్యారు.

అనంతరం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. 14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 69 పరుగులు చేసి, ఓవరాల్‌గా 361 పరుగుల లీడ్‌ను సాధించింది. స్మృతి మంధన 26 పరుగులు చేసి ఔట్‌ కాగా.. షఫాలీ వర్మ (32), యస్తిక భాటియా (7) క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు శుభ సతీశ్‌ (69), జెమీమా రోడ్రిగెజ్‌ (68), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (67), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (49), స్నేహ్‌ రాణా (30) రాణించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. కేట్‌ క్రాస్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, చార్లెట్‌ డీన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement