photo courtesy:ipl twitter
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక్కడ ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలవడంతో రోహిత్ శర్మ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు. ఒకవేళ టాస్ గెలిచి ఉంటే సన్‌రైజర్స్ కూడా తొలుత బ్యాటింగ్ ఎంచుకునే విషయం టాస్ సమయంలో ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. ‘ మేము టాస్ గెలిస్తే తప్పకుండా ముందుగా బ్యాటింగ్ వెళ్లాలనుకున్నాం. టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసేవాళ్లం. గత మ్యాచ్‌లను ఇక్కడ ఏమి జరిగిందో తెలుసు. గత సీజన్‌లో కూడా మేము ఇదే పొజిషన్‌లో ఉన్నాం. మేము నాలుగు మార్పులతో బరిలోకి దిగాం’ అని వార్నర్ పేర్కొన్నాడు.
ఏమీ చెప్పలేని పరిస్థితి: రోహిత్
ఇక ఈ పిచ్ గురించి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌కే మొగ్గుచూపుతున్నాం. ఈ పిచ్ గురించి ఏమీ చెప్పలేని పరిస్థితి. ట్రాక్ మాత్రం బానే ఉంది. మ్యాచ్ ఆరంభమైన తర్వాత కానీ పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. ఇక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ప్రదర్శన చేయడం చాలా ముఖ్యం. మేము ఆడిన గత మ్యాచ్ లో విజయం సాధించడం సంతోషంగా ఉంది. మార్కో జాన్సెన్ స్థానంలో ఆడమ్ మిల్నేను తుది జట్టులోకి తీసుకున్నాం’ అని తెలిపాడు.
ఇక్కడ చదవండి: కేన్ విలియమ్సన్ గాయంపై అప్‌డేట్
నన్ను చంపాలనే ప్రోగ్రామ్ పెట్టారా..?: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment