Breadcrumb
కేకేఆర్‌ను తిప్పేసిన కుల్దీప్.. లో స్కోరింగ్ గేమ్‌లో ఢిల్లీదే విజయం
Published Thu, Apr 28 2022 7:06 PM | Last Updated on Thu, Apr 28 2022 11:29 PM
Live Updates
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
కేకేఆర్‌ను తిప్పేసిన కుల్దీప్.. లో స్కోరింగ్ గేమ్‌లో ఢిల్లీదే విజయం
147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చినప్పటికీ, ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (33 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో డేవిడ్ వార్నర్ (42), మధ్యలో లలిత్ యాదవ్ (22), అక్షర్ పటేల్ (27) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (3/24) ఆరంభంలోనే వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. హర్షిత్ రాణా, నరైన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు కుల్దీప్ యాదవ్ (4/14) తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్‌ను దెబ్బ కొట్టడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. నితీశ్ రాణా (33 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 57), శ్రేయస్ (37 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 42) రాణించడంతో కేకేఆర్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో ముస్తాఫిజుర్ (3/18) కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అక్షర్ రనౌట్
అనవసర రెండో పరుగు కోసం ప్రయత్నించి అక్షర్ పటేల్ (24) రనౌటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 113/6. క్రీజ్‌లో రోవ్‌మన్ పావెల్ (5), శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు.
84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 11వ ఓవర్లో లలిత్ యాదవ్‌ను నరైన్ ఔట్ చేయగా, మరుసటి ఓవర్ తొలి బంతికే కెప్టెన్ రిషబ్ పంత్‌ను (2) ఉమేశ్ బోల్తా కొట్టించాడు. 12 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 87/5. క్రీజ్‌లో రోవ్‌మన్ పావెల్ (1), అక్షర్ (2) ఉన్నారు.
నాలుగో వికెట్ డౌన్
11వ ఓవర్లో ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్ (22) ఎల్భీడబ్యూగా వెనుదిరిగాడు. 11 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 84/4. క్రీజ్‌లో పంత్ (1) ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
10వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ ఢిల్లీని మరో డెబ్బ కొట్టాడు. ధాటిగా ఆడుతున్న వార్నర్‌ను (42) ఉమేశ్ పెవిలియన్‌కు పంపాడు. వార్నర్.. నరైన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 83/3. క్రీజ్‌లో లలిత్ యాదవ్ (22), పంత్ (1) ఉన్నారు.
లక్ష్యం దిశగా తీసుకెళ్తున్న వార్నర్, లలిత్
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ జట్టును డేవిడ్ వార్నర్ (32), లలిత్ యాదవ్ (17) ఆదుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ తమ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. 8 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 66/2.
ఢిల్లీకి మరో షాక్
తొలి బంతికే పృథ్వీ షా వికెట్ కోల్పోయిన ఢిల్లీకి రెండో ఓవర్లో మరో షాక్ తగిలింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (13) ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 26/2. క్రీజ్‌లో డేవిడ్ వార్నర్ (9), లలిత్ యాదవ్ (3) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా డకౌట్
147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా డకౌటయ్యాడు.
కుల్దీప్ మాయాజాలం, నితీశ్ మెరుపులు.. ఢిల్లీ టార్గెట్ 147
కుల్దీప్ యాదవ్ (4/14) తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్‌ను దెబ్బ కొట్టినప్పటికీ.. నితీశ్ రాణా (33 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 57), శ్రేయస్ (37 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ముస్తాఫిజుర్ (3/18) ఆఖరి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి (నితీశ్, రింకూ సింగ్ (23), సౌథీ (0)) కేకేఆర్‌ను ఓ మోస్తరు స్కోర్ కూడా చేయకుండా కట్టడి చేశాడు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
కేకేఆర్‌కు బిగ్ షాక్.. ఒకే ఓవర్లో శ్రేయస్, రసెల్ ఔట్
కుల్దీప్ యాదవ్ కేకేఆర్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో శ్రేయస్ (42), రసెల్ (0)లను అద్భుత బంతులతో బోల్తా కొట్టించి పెవిలియన్‌కు పంపాడు. శ్రేయస్, రసెల్ ఇద్దరినీ పంత్ అద్భుతమైన క్యాచ్, స్టంప్ ఔట్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 85/6. క్రీజ్‌లో నితీశ్ రాణా (22), రింకూ సింగ్ ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న శ్రేయస్, నితీశ్ రాణా
వరుసగా 4 వికెట్లు కోల్పోయాక తేరుకున్న కేకేఆర్ ప్రస్తుతం నిలకడగా ఆడుతుంది. శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 38), నితీశ్ రాణా (13) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 72/4.
కుల్దీప్ మాయాజాలం.. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన కేకేఆర్
కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రెండు వరుస బంతులతో కేకేఆర్‌కు గట్టి దెబ్బకొట్టాడు. 8వ ఓవర్ రెండో బంతికి ఇంద్రజిత్‌ను ఔట్ చేసిన కుల్దీప్.. మూడో బంతికి సునీల్ నరైన్ (0)ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. నరైన్.. కుల్దీప్ బౌలింగ్‌లో ఎల్భీగా వెనుదిరిగాడు. 8 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 37/4. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్ (18), నితీశ్ రాణా ఉన్నారు.
వరుసగా వికెట్లు కోల్పోతున్న కేకేఆర్
ఢిల్లీ బౌలర్ల ధాటికి కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి బాబా ఇంద్రజిత్ (8 బంతుల్లో 6) ఔటయ్యాడు.
అక్షర్ పటేల్ ఉచ్చులో పడ్డ వెంకటేశ్ అయ్యర్
ఢిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్ చాకచక్యంగా వెంకటేశ్ అయ్యర్‌ను బోల్తా కొట్టించాడు. లెగ్ స్లిప్‌లో ఫీల్డర్ మొహరించి లెగ్ సైడ్ బంతిని సంధించగా స్వీప్ షాట్ ఆడబోయి చేతన్ సకారియా చేతికి చిక్కి వెంకటేశ్ అయ్యర్ (12 బంతుల్లో 6) పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 24/2. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్ (11), బాబా ఇంద్రజిత్ (1) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. డీసీ అరంగేట్రం బౌలర్ చేతన్ సకారియా బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ (7 బంతుల్లో 3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 6/1. క్రీజ్‌లో వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేతన్ సకారియా
కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్ ఫించ్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, బాబా ఇంద్రజిత్, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, హర్షిత్ రాణా
Related News By Category
Related News By Tags
-
IPL 2022: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి
IPL 2022 DC Vs KKR- Rovman Powell: వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్‌లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ముంబై ఇండియన్...
-
IPL 2022: మా ఓటమికి కారణం అదే: శ్రేయస్ అయ్యర్
IPL 2022 KKR Vs DC: ఐపీఎల్-2022లో వరుసగా ఐదో పరాజయాన్ని నమోదు చేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్...
-
IPL 2022: కోల్‌కతా... అదే కథ
ముంబై: ప్రత్యర్థి స్పిన్, పేస్ ధాటికి మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మళ్లీ తడబడింది. ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా ఐదో పరాజయం చవిచూసింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ (4/14...
-
ఢిల్లీని ఢీకొట్టనున్న కేకేఆర్.. పంత్‌పై శ్రేయస్ ప్రతీకారం తీర్చుకునేనా..?
ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు రెండోసారి ఎదురెదురుపడనున్నాయి. వాంఖడే వేదికగా ఇరు జట్లు ఇవాళ (ఏప్రిల్ 28) మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:3...
-
DC VS KKR: న్యూలుక్‌తో బరిలోకి దిగనున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 28) మరో కీలక సమరం జరుగనుంది. ప్రస్తుత సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు నేటి మ్యాచ్‌ల...
Comments
Please login to add a commentAdd a comment