ఈ వయసులో బంతిని తన్నడం అంటే మాటలా? | Kazuyoshi Miura-Is-The Worlds-Oldest Professional Footballer From Japan | Sakshi
Sakshi News home page

Kazuyoshi Miura: ఈ వయసులో బంతిని తన్నడం అంటే మాటలా?

Jul 13 2023 1:38 PM | Updated on Jul 13 2023 1:44 PM

Kazuyoshi Miura-Is-The Worlds-Oldest Professional Footballer From Japan - Sakshi

మామూలుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 35 ఏండ్ల వయసులో కెరీర్‌కు వీడ్కోలు పలుకుతుంటారు. కానీ, జపాన్‌ వెటరన్‌ ప్లేయర్‌ కజుయోషి మియుర విషయంలో మాత్రం మరోలా ఉంది. 56 ఏండ్ల వయసులోనూ యువకులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతూ.. రిటైర్మెంట్‌ కావడానికి నిరాకరిస్తున్నాడు. ప్రస్తుత ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎక్కువ వయసు ఉన్న ఏకైక ప్లేయర్‌గా మియుర కొనసాగుతున్నాడు.

పోర్చుగల్‌కు చెందిన లిగా-2తో కలిసి మరో సీజన్‌కు కాంట్రాక్టు పొందిన మియురాను అందరూ ముద్దుగా ‘కింగ్‌ కాజు’ అని పిలుచుకుంటారు. సరిగ్గా 37 ఏండ్ల క్రితం తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ మొదలుపెట్టిన మియుర.. జపాన్‌ తరఫున అత్యధిక కాలం కొనసాగాడు.

అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌కు 89 మ్యాచ్‌లాడిన ఈ వెటరన్‌ సాకర్‌ ప్లేయర్‌ 55 గోల్స్‌ చేశాడు. 1992లో ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ గెలిచిన జపాన్‌ జట్టులో మియుర సభ్యుడు కావడం విశేషం. 23 ఏండ్ల క్రితం జపాన్‌ జాతీయ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న మియూర.. పోర్చుగల్‌ క్లబ్‌కు సేవలందిస్తున్నాడు.

చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'

#TNPL2023: టీఎన్‌పీఎల్‌ విజేత లైకా కోవై కింగ్స్‌.. వరుసగా రెండోసారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement