రోహిత్‌ దూరమైతే.. కెప్టెన్‌గా ఎవరు? | Kieron Pollard Gives An Update On Rohit Sharmas Fitness | Sakshi
Sakshi News home page

రోహిత్‌ దూరమైతే.. కెప్టెన్‌గా ఎవరు?

Published Mon, Oct 19 2020 4:46 PM | Last Updated on Tue, Oct 20 2020 5:44 PM

Kieron Pollard Gives An Update On Rohit Sharmas Fitness - Sakshi

దుబాయ్‌: కింగ్స్‌ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భాగంగా తొలి సూపర్‌ ఓవర్‌లో రోహిత్‌ శర్మ-డీకాక్‌లు బ్యాటింగ్‌కు దిగారు. కింగ్స్‌ పంజాబ్‌ నిర్దేశించిన ఆరు పరుగుల లక్ష్యాన్ని వీరిద్దరికీ ఏమాత్రం కష్టం కాదనిపించింది. కానీ మహ్మద్‌ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో వారిని కట్టడి చేశాడు. సరిగ్గా ఐదు పరుగులే చేయడం, మళ్లీ సూపర్‌ ఓవర్‌ ఆడటం అందులో కింగ్స్‌ పంజాబ్‌ గెలవడం జరిగింది. అయితే రోహిత్‌ శర్మ ఆరోగ్యం బాలేని కారణంగానే సరిగా బ్యాటింగ్‌ చేయలేదనే వాదన వినిపించింది. దీనిపై సహచర ఆటగాడు, వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ కీరోన్‌ పొలార్డ్‌ పెదవి విప్పాడు.  మ్యాచ్‌ ముగిసిన తర్వాత అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై పొలార్డ్‌పై మాట్లాడాడు. రోహిత్‌కు బాలేని కారణంగానే తాను వచ్చానని పోస్ట్‌ మ్యాచ్‌ కార్యక్రమంలో పొలార్డ్‌ తెలిపాడు. ‘ అసలు రోహిత్‌కు అనారోగ్యం ఏమిటనేది నాకు పూర్తిగా తెలియదు. రోహిత్‌ పరిస్థితిని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పర్యవేక్షిస్తోంది. రోహిత్‌కు ఆరోగ్యం బాలేదనేది నిజం. కానీ ఏమిటనేది దానిపై నాకు స్పష్టత లేదు. హెల్త్‌ కండిషన్‌ బాలేదనే విషయాన్ని మాత్రమే రోహిత్‌ నాకు చెప్పాడు. అది ఏమిటనేది త్వరలో తెలుస్తోంది. ఆ విషయాన్ని అభిమానులకు చెప్పాలనుకున్నా. రోహిత్‌ ఒక పోరాట యోధుడు. మళ్లీ జట్టుకు సేవలందిస్తాడు’ అని పొలార్డ్‌ తెలిపాడు.(మురిసిపోతూ ఎగిరి గంతులేసింది)

ఇంతకీ రోహిత్‌కు ఏమైందనేది తెలియకపోయినా ముంబై ఆడి తదుపరి మ్యాచ్‌ల్లో ఆడతాడా.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడా అనేది ముంబై అభిమానుల్ని వేధించే ప్రశ్న. రోహిత్‌ ఫిట్‌గా లేకపోతే మాత్రం రెస్ట్‌ తీసుకుంటాడు. పోరాట యోధుడు.. తిరిగి జట్టుతో కలుస్తాడని పొలార్డ్‌ చెప్పడంతో ప్రస్తుతానికి అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని చెబుతోంది. ఒకవేళ రోహిత్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమైతే అతని స్థానంలో సారథ్యం ఎవరు చేస్తారనేది మరొకప్రశ్న. దానికి పొలార్డ్‌కే అన్ని అర్హతలు ఉన్నాయి. అటు వెస్టిండీస్‌ టీ20 జట్టుకు కెప్టెన్‌గానే కాకుండా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో ట్రినిబాగో నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ జట్టు ఈ ఏడాది ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఇది సీపీఎల్‌ ఒక రికార్డుగా నమోదైంది. ఆరోగ్య సమస్యతో రోహిత్‌ దూరమైన పక్షంలో అతని స్థానాన్ని(కెప్టెన్సీ) భర్తీ చేసే రేసులో ముందు వరుసలో ఉండేది మాత్రం పొలార్డే.  శుక్రవారం సీఎస్‌కేతో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. అప్పటికి రోహిత్‌ ఫిట్‌ అవుతాడా.. లేదా అనేది  చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement