Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022 సీజన్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఇండియన్స్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరగేంట్రం చేసిన కార్తికేయ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ కెప్టెన్ సంజు శాంసన్ వికెట్ సాధించాడు. దీంతో ఈ ఏడాది సీజన్‌లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేసింది. అదే విధంగా గురువారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ కార్తికేయ రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కాగా తాజాగా ముంబై ఇండియన్స్ పోస్ట్ చేసిన వీడియోలో కార్తికేయ పలు విషయాలను పంచుకున్నాడు. ఐపీఎల్‌లో తొలి వికెట్ పడగొట్టగానే తన తండ్రి శ్యామ్ మత్ సింగ్ ఎలా సెలబ్రేషన్స్ జరుపుకున్నాడో కార్తికేయ వెల్లడించాడు.
"నేను రాజస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతున్నాని మా నాన్నకు చెప్పాను. అతడు తన మొత్తం పోలీస్ బెటాలియన్‌కి ఈ విషయం చెప్పాడు. వారు అంతా ప్రొజెక్టర్‌ను అమర్చుకుని మ్యాచ్‌ను చూశారు. నేను నా మొదటి వికెట్ సాధించగానే, అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. మా నాన్నను అందరూ కౌగిలించుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆ వీడియోను నాకు మా నాన్న షేర్ చేశారు. ఆ వీడియో చూడగానే నాకు ఎంతో ఆనందం కలిగింది. ఎందకంటే నా కెరీర్ ఆరంభం నుంచి అతడు నాకు ఎంతో మద్దతుగా ఉన్నారు" అని కుమార్ కార్తికేయ పేర్కొన్నాడు.
చదవండి: Sunil Gavaskar: 'అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. భారత జట్టులోకి తిరిగి వస్తాడు'
Comments
Please login to add a commentAdd a comment