ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం) సంబురాల్లో భాగంగా బీసీసీఐ నిర్వహించతలపెట్టిన లెజెండ్స్ క్రికెట్ లీగ్ (రెండో సీజన్) సెప్టెంబర్ 16న ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో భారత లెజెండ్స్ ఎలెవెన్ జట్టు.. వరల్డ్ లెజెండ్స్ ఎలెవన్ టీమ్‌తో తలపడనుంది.
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఈ లీగ్‌లో భారత లెజెండ్స్ ఎలెవన్ తరఫున ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. భారత్ లెజెండ్స్ టీమ్‌కు గంగూలీ సహా పలువురు భారత దిగ్గజ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. వరల్డ్ లెజెండ్స్ జట్టు తరఫున వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు.
కాగా, వరల్డ్ లెజెండ్స్ టీమ్‌కు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్‌ను ఎంపిక చేయడం వివాదాస్పదంగా మారింది. గిబ్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన కశ్మీర్ టీ20 లీగ్‌లో పాల్గొనడమే ఇందుకు కారణం. గిబ్స్ ఎంపికపై భారత క్రికెట్ అభిమానలు సోషల్‌మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ పాక్ లీగ్‌లో పాల్గొన్న ఆటగాడిని భారత్‌లో ఎలా ఆడనిస్తారని మండిపడుతున్నారు.
ఈ విషయంలో నెటిజన్లు బీసీసీఐ బాస్ గంగూలీని టార్గెట్ చేశారు. దీంతో అప్రమత్తమైన దాదా.. గిబ్స్‌ను లెజెండ్స్ లీగ్ నుంచి తప్పించి, షేన్ వాట్సన్‌ని అతని స్థానంలో భర్తీ చేశాడు. గంగూలీ నిర్ణయంతో సంతృప్తి చెందిన అభిమానులు విమర్శించిన నోళ్లతోనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కశ్మీర్ లీగ్‌లో పాల్గొనకూడదని బీసీసీఐ గతంలో ప్రపంచదేశాల క్రికెటర్లను ఆదేశించింది. అయితే గిబ్స్ బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసి కశ్మీర్ లీగ్‌లో పాల్గొన్నాడు.
చదవండి: పసికూనపై పాక్ బ్యాటర్ ప్రతాపం.. టీమిండియాతో ఆడి చూపించు!
Comments
Please login to add a commentAdd a comment