ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ధోని.. వీడియో వైరల్‌ | MS Dhoni plays golf with Donald Trump, pics goes viral - Sakshi
Sakshi News home page

Dhoni With Trump: డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ధోని.. వీడియో వైరల్‌

Sep 8 2023 11:19 AM | Updated on Sep 8 2023 11:33 AM

MS Dhoni playing golf with Donald Trump - Sakshi

యూఎస్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, వరల్డ్‌నెం1 కార్లోస్ అల్కరాజ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. 12వ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌ 2 గంటల 30 నిమిషాల్లో 6–3, 6–2, 6–4తో గెలుపొందాడు.

ఎంఎస్‌ ధోని ప్రత్యక్షం.. 
కాగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని హాజరయ్యాడు. ధోని స్నేహితులతో నవ్వుతూ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించాడు. కూల్‌బ్రేక్‌ సమయంలో కెమెరా కంటికి ధోని చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ ఓపెన్ అధికారిక బ్రాడ్‍కాస్టర్ సోనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కాగా ధోనికి క్రికెట్‌తో పాటు టెన్నిస్‌ అంటే ఇంతో ఇష్టం. గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో కూడా క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌తో కలిసి ధోని వెళ్లాడు.

డొనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్..
యూఎస్‌ ఓపెన్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చిన ధోనికి.. ఆ దేశ మాజీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నుంచి ప్రత్యేక​ అహ్హనం అందింది. తనతో కలిసి గోల్ఫ్‌ ఆడాలని మిస్టర్‌ కూల్‌ను ట్రంప్‌ కోరారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ బెడ్మినస్టర్‌లో గోల్ఫ్ ఆడారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌ను ఐదో సారి ఛాంపియన్‌గా నిలిపిన ధోని.. ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు.
చదవండి: World Cup 2023: సంజూ కంటే అతడు చాలా బెటర్‌.. విధ్వంసానికి 30 బంతులు చాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement