న్యూఢిల్లీ: మూడు రోజుల క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 20 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఆ మ్యాచ్‌లో ఒక ‘వైడ్ వివాదం’ తారాస్థాయికి చేరింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19 ఓవర్‌లో ఒక బంతిని వైడ్ ఇద్దామనుకున్న అంపైర్.. ధోని సూచనతో ఆగిపోయాడు. ఆ సమయానికి ఎస్‌ఆర్‌హెచ్‌కు 11 బంతుల్లో 25 పరుగులు అవసరం. శార్దూల్ ఠాకూర్ వేసిన ఆ ఓవర్‌లో రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేస్తుండగా ఇది జరిగింది. అది అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌గా దూరంగా వెళ్లిందని భావించిన అంపైర్ దాన్ని వైడ్ ఇవ్వబోయాడు. కానీ వికెట్ల వెనకాల ఉన్న ధోని అది వైడ్ కాదంటూ అంపైర్‌కు తెలిపాడు. దాంతో అంపైర్ ఆగిపోయి దాన్ని వైడ్ ఇవ్వలేదు. (కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై)
డగౌట్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సైతం అంపైర్ చర‍్యకు ఆశ్చర్యపోయాడు. దీనిపై సోషల్ మీడియా హోరెత్తింది. అటు ఇరుజట్ల అభిమానులతో పాటు హర్భజన్ సింగ్ కూడా ఇదేంటి అంటూ ప్రశ్నించాడు. అయితే ఒక సీఎస్‌కే ఆటగాడిగా ఉండి ఇదేంటి అంటూ హర్భజన్‌పై ఆ ఫ్రాంచైజీ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఈ ఐపీఎల్‌కు దూరంగా ఉన్న హర్భజన్ సింగ్.. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆ వైడ్ నిర్ణయాన్ని అంపైర్ ఉపసంహరించుకోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు. ధోని నిర్ణయాన్ని ఎగతాళి చేస్తున్నాడంటూ సీఎస్‌కే ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై భజ్జీ ఎట్టకేలకు స్పందించాడు. ‘ మీ ట్రోల్స్ నన్నేమి చేయలేవు. అవి నాపై ప్రభావం చూపలేవు. పందితో కుస్తీ పడకూడదనే విషయం నేను ఎప్పుడో నేర్చుకున్నా. మీకు అంటుకున్న బురద.. పక్కన ఉన్నవారికి కూడా అంటుకుంది. పంది ఎలా మురికిలో దొర్లుతుందో అలా’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.(గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?)
I learned a long ago never to Wrestle with a pig....You get dirty, and beside, the pig likes it
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 16, 2020
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 14, 2020
Comments
Please login to add a commentAdd a comment