దుబాయ్: ఐపీఎల్ కోసం యూఏఈలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఒకదాని వెంట మరొకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తొలుత కరోనా వైరస్‌తో కంగారు పడ్డ సీఎస్‌కే.. ఆపై వైస్ కెప్టెన్ సురేశ్ రైనా స్వదేశానికి వచ్చేయడంతో మరింత ఢీలా పడింది. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పోరుకు సిద్ధమవుతున్నప్పటికీ లోలోపల ఎక్కడో రైనా స్థానంపై ఇంకా తర్జన భర్జనలు పడుతూనే ఉంది. ఒకవేళ రైనా తిరిగి రాకపోవడం కుదరకపోతే ఆ స్థానంలో ఎవర్నీ దింపాలని ఇప్పటికే సమాలోచనలు చేస్తున్న సీఎస్‌కేకు మరో షాక్ తగిలింది. ఈ సీజన్ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం లేదని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సీఎస్‌కే సమాచారం చేరవేశాడనే వార్తలు వస్తున్నాయి. (చదవండి: సీఎస్‌కే వాట్సాప్ గ్రూప్ నుంచి రైనా ఔట్?)
వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ ఆడలేనని హర్భజన్ తెలిపినట్లు సమాచారం. ఇప్పటివరకూ యూఏఈకు వెళ్లాలా.. వద్దా అనే డైలమాలో ఉన్న భజ్జీ.. చివరకు ఆడలేననే విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచి ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్న సీఎస్‌కే.. భజ్జీ అందుబాటులో లేకపోతే కష్టాలు తప్పకపోవచ్చు. స్పిన్ బౌలింగ్‌లో ఎంతో అనుభవం ఉన్న భజ్జీ గనుక జట్టుతో చేరకపోతే ఆ జట్టుకు స్పిన్ కష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఒకవేళ భజ్జీ దూరమైతే మాత్రం ఆ భారాన్ని ఇమ్రాన్ తాహీర్ మోయాల్సి ఉంటుంది. సీఎస్‌కేలో హర్భజన్ తర్వాత చెప్పుకోదగ్గ స్పిన్నర్ తాహీర్. ఇప్పుడు తాహీర్‌పైనే సీఎస్‌కే స్పిన్ భారం పడే అవకాశం ఉంది. కాగా, ఇంకా తాహీర్ జట్టుతో కలవలేదు. ప్రస్తుతం సీపీఎల్ ఆడుతున్నాడు. ఆ టోర్నీ ఈ నెల 10వ తేదీతో ముగుస్తుండటంతో ఆపై మాత్రమే సీఎస్‌కేతో కలుస్తాడు. ఇక మరొక బౌలర్ పీయూష్ చావ్లా. అడపాదడపా మెరుపులు తప్పితే పూర్తిస్థాయిలో గ్యారంటీ ఉన్న స్పిన్నర్ కాదు. ఈ క్రమంలో హర్భజన్ ఆడకపోతే మాత్రం ఆ లోటు సీఎస్‌కేకు కనిపించడం ఖాయం.(చదవండి: ‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’)
Comments
Please login to add a commentAdd a comment