చెన్నై: ముస్తాక్ అలీ టి20 టోర్నీలో మేఘాలయ కెప్టెన్ పునీత్ బిష్త్ మిజోరాం తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 17 సిక్సర్లతో 146 పరుగులు చేసి టి20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు. గతంలో శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా 15 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (18) పేరిట ఉంది. మేఘాలయ 230 పరుగులు సాధించగా, 100 పరుగులు మాత్రమే చేయగలిగిన మిజోరాం 130 పరుగుల తేడాతో చిత్తయింది. ముంబైతో జరిగిన మరో మ్యాచ్‌లో మొహమ్మద్ అజహరుద్దీన్ (54 బంతుల్లో 137 నాటౌట్; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు ప్రదర్శనతో కేరళ జట్టు 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేయగా... కేరళ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment