కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026లో సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్, బార్బడోస్ ట్రైడెంట్స్ ప్లేయర్ క్వింటన్ డికాక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా వార్నర్ పార్క్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ అద్భుత సెంచరీతో చెలరేగాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 57 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సఫారీ సూపర్ స్టార్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా దిగ్గజ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లిల రికార్డును సమం చేశాడు.
వీరు ముగ్గురూ ఇప్పటివరకు టీ20ల్లో పది సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(22) అగ్రస్ధానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(13) రెండో స్ధానంలో ఉన్నాడు. కాగా ఈ ఫీట్‌ను కోహ్లి కేవలం 413 ఇన్నింగ్స్‌లలో అందుకోగా.. డికాక్‌కు 443 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది.


