
Ranji Trophy 2021-22: దేశవాళీ అత్యుత్తమ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 2021-22 సీజన్‌లో మధ్యప్రదేశ్ సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది. గతంలో (1998-99) ఒక్కసారి మాత్రమే ఫైనలిస్ట్‌గా నిలిచిన మధ్యప్రదేశ్ తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది.
ఆదివారం ముగిసిన ఫైనల్‌లో ముంబైని 6 వికెట్ల తేడాతో చిత్తు చేయడం ద్వారా మధ్యప్రదేశ్ తమ చిరకాల కోరికను సాకారం చేసుకుంది. ఆఖరి రోజు ముంబై నిర్ధేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ను తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు శుభమ్ శర్మ (30), రజత్ పాటిదార్ (30) విజయతీరాలకు చేర్చారు.
2021-22 సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలపై ఓ లుక్కేద్దాం..
- అత్యధిక పరుగులు- సర్ఫరాజ్ ఖాన్ (ముంబై) 9 ఇన్నింగ్స్‌ల్లో 982 పరుగులు, మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్ పాటిదార్ (9 ఇన్నింగ్స్‌ల్లో 658 పరుగులు)
- అత్యధిక స్కోర్- సకీబుల్ గని (బీహార్) 341
- అత్యుత్తమ సగటు- చేతన్ బిస్త్ (నాగాలాండ్) 311.50
- అత్యధిక శతకాలు- చేతన్ బిస్త్ (5), సర్ఫరాజ్ ఖాన్ (4), శుభమ్ శర్మ (4)
- అత్యధిక అర్ధశతకాలు- రజత్ పాటిదార్ (5), షమ్స్ ములానీ (5)
- అత్యధిక ఫోర్లు- రజత్ పాటిదార్ (100)
- అత్యధిక సిక్సర్లు- సర్ఫరాజ్ ఖాన్ (19)
- అత్యధిక వికెట్లు- ముంబైకి చెందిన షమ్స్ ములానీ (45), మధ్యప్రదేశ్‌కు చెందిన కుమార్ కార్తికేయ (32)
- అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు- మయాంక్ మిశ్రా (7-44)
- అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత- షమ్స్ ములానీ (6)
చదవండి: కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment