మూడో రౌండ్‌లోకి అల్‌కరాజ్, మెద్వెదెవ్
లండన్: ఐదో ప్రయత్నంలోనూ నార్వే స్టార్ ప్లేయర్, ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో
రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో రూడ్ 4–6, 5–7, 7–6 (7/1), 3–6తో ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. 3 గంటల 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రూడ్ 15 ఏస్‌లు
సంధించినా, 47 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అల్‌కరాజ్ 7–6 (7/5), 6–2, 6–2తో వుకిచ్ (ఆస్ట్రేలియా)పై, మెద్వెదెవ్ 6–7 (3/7), 7–6 (7/4), 6–4, 7–5తో ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలు పొందారు. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. అంకా టొడోని (రొమేనియా)తో జరిగిన రెండో రౌండ్‌లో కోకో గాఫ్ 6–2, 6–1తో గెలిచింది.
ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత నయోమి ఒసాకా (జపాన్) రెండో రౌండ్‌లోనే ని్రష్కమించింది. ఎమ్మా నవారో (అమెరికా) 6–4, 6–1తో ఒసాకాను ఓడించింది. మరోవైపు భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ డబుల్స్‌లోనూ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. తొలి రౌండ్ లో సుమిత్ –లాజోవిచ్ (సెర్బియా) ద్వయం 2–6, 2–6తో మారి్టనెజ్–మునార్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment