Sehwag Recreates RRR Poster With Ganguly And Wish Him 49th Birthday - Sakshi
Sakshi News home page

HBD Ganguly: 'ఆర్ఆర్ఆర్' పోస్ట‌ర్‌తో విష్‌ చేసిన వీరూ..

Published Thu, Jul 8 2021 4:51 PM | Last Updated on Thu, Jul 8 2021 7:16 PM

Sehwag Wishes Ganguly On His 49th Birthday With RRR Poster - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ 49వ పుట్టిన రోజు(జులై 8, 2021) సందర్భంగా మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్, డ్యాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్ సైతం దాదాకు శుభాకాంక్షలు తెలిపాడు. నిన్న(జులై 7) ధోనీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న‌దైన స్టైల్లో  వెరైటీగా విషెస్ తెలిపిన వీరూ.. గురువారం గంగూలీ బ‌ర్త్‌డేకు కూడా అలాగే వెరైటీ శుభాకాంక్షలు చెప్పాడు. దీనికోసం అత‌డు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న‌ తెలుగు మూవీ ఆర్ఆర్ఆర్ పోస్టర్‌ను వాడాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ బైక్ వెళ్తున్న పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్‌ ఈ మధ్యే రిలీజ్‌ చేసింది. 

ఈ పోస్టర్‌ని మార్ఫింగ్ చేసిన వీరూ.. ఎన్టీఆర్ ప్లేస్‌లో తనను, రామ్‌ చరణ్ స్థానంలో గంగూలీని ఉంచాడు. ఇక బైక్‌కి ముందు జాతీయ జెండాని అమర్చి.. నెంబర్ ప్లేట్‌‌కి 'దాదా' అని రాసుకొచ్ఛాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. అయితే, అంతకుముందే సెహ్వాగ్‌ మరో ట్వీట్ ద్వారా దాదాకు శుభాకాంక్షలు చెప్పాడు. 'గంగూలీకి ఉన్న అభిరుచి, ఉద్దేశాలను కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. అలాంటి వారిలో నేను ఒకడిని. హ్యాపీ బర్త్‌డే దాదా' అని ట్వీట్ చేశాడు. వీరూ.. నిన్న ధోనీని విష్ చేసిన‌ట్టుగానే, గంగూలీని కూడా సర్‌ప్రైజ్‌ చేశాడు. గ‌త నాలుగేళ్లుగా దాదా బ‌ర్త్‌డే రోజు తాను చేసిన ట్వీట్ల‌ను రీపోస్ట్ చేసి, తన ప్రత్యేక శైలిని చాటుకున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement