నా లైఫ్‌లోనే ఇదొక వరస్ట్‌: అశ్విన్‌ | Six days Of Quarantine One Of The Worst Times In My Life, Ashwin | Sakshi
Sakshi News home page

నా లైఫ్‌లోనే ఇదొక వరస్ట్‌: అశ్విన్‌

Published Fri, Sep 4 2020 10:54 AM | Last Updated on Fri, Sep 4 2020 11:39 AM

Six days Of Quarantine One Of The Worst Times In My Life, Ashwin - Sakshi

దుబాయ్‌:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)తాజా సీజన్‌లో భాగంగా ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. క్వారంటైన్‌ అనుభవాన్ని చెత్తగా అభివర్ణించాడు. యూఏఈలో అడుగుపెట్టిన వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లిన అశ్విన్‌ ఇప్పుడు ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాడు. అయితే దుబాయ్‌లో తన ఆరు రోజుల క్వారంటైన్‌ అనేది జీవితంలోనే ఒక చెత్త సమయంగా పేర్కొన్నాడు. ‘ ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ యూట్యూబ్‌ చానల్‌లో వీడియో అప్‌లోడ్‌ చేసిన అశ్విన్‌ కొన్ని అనుభవాలను పంచుకున్నాడు. ‘ గత ఐదు-ఆరు మాసాల నుంచి ఇంటికే పరిమితమయ్యాం. నేను ఎప్పుడూ అభిమానులకు అందుబాటులోనే ఉంటూ ఈ సంక్షోభాన్ని గడిపా. (చదవండి: యూఎస్‌ ఓపెన్‌లో మరో సంచలనం)

నా యూట్యూబ్‌ చానల్‌ పని చేసుకుంటూ దాన్ని ఆస్వాదించా. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో కూడా పాల్గొన్నా. కానీ దుబాయ్‌లో గడిపిన ఆరో రోజులు గడిపిన క్వారంటైన్‌ సమమం మాత్రం చాలా వరస్ట్‌గా గడిచింది. ఇది నా జీవితంలోనే అత్యంత చెత్త సమయంగా చెప్పొచ్చు. తొలి రోజు నా హోటల్‌ పక్కనే ఉన్న లేక్‌ను చూస్తూ గడిపా. అదే సమయంలో బూర్జ్‌ ఖాలిఫాను కూడా రూమ్‌ను వీక్షించాను. అది చాలా అద్భుతం. కానీ అద్భుతాన్ని పదేపదే చూడటం కూడా విసుగొచ్చింది. ఎన్నిసార్లు రూమ్‌ బాల్కనీలో కూర్చొని దాన్ని చూస్తాం. ఇక్కడ చాలా వేడిగా ఉంది. సాధారణంగా నాకు మొబైల్‌ ఫోన్‌తో ఎక్కువ సేపు గడపలేను. చాలాకాలం నుంచి మొబైల్‌ ఫోన్‌ను సాధ్యమైనంత వరకూ దూరంగానే ఉంచుతున్నా. గత వారంలో ఆరు గంటలు మాత్రమే చూశా. ఇది ఈ మధ్యకాలంలో మొబైల్‌తో గడపడం నాకు చాలా ఎక్కువ అనిపించింది’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.(చదవండి: ఐపీఎల్‌ 2020: బీసీసీఐకి మరో సవాల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement