
దుబాయ్: ఐపీఎల్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్, బౌలర్లకు ఇచ్చే ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లకు తన దృష్టిలో ఏమాత్రం విలువ లేదని అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మన ఆటతో జట్టును గెలిపించడమే అన్నింటికంటే ముఖ్యమని అతను అభిప్రాయపడ్డాడు. ‘జట్టు గెలవనంత వరకు ఇలాంటివన్నీ పనికిమాలినవి. ఆ అంకెల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు ఉంటే కంటితుడుపులాంటివి మాత్రమే. జట్టు విజయంలో మన పాత్రను సమర్థంగా పోషించామా లేదా అన్నదే ముఖ్యం’ అని ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వ్యాఖ్యానించాడు.
కాగా, ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 144 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 6.81 ఎకానమితో 131 వికెట్లు తీశాడు. గత ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అశ్విన్ భారీగానే (35) పరుగులు సమర్పించుకున్నాడు. ఒక వికెట్ తీశాడు. ఆ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 162 పరుగులు చేయగా.. మరో రెండు బంతులు ఉండగానే రోహిత్ సేన లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై తొలి స్థానానికి చేరగా.. ఢిల్లీ రెండో స్థానంలో కొనసాగుతోంది.
(చదవండి: ధోనిపై విమర్శలకు, ఫ్యాన్ సమాధానం)
Comments
Please login to add a commentAdd a comment