
శ్రీలంక అరంగేట్రం స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ రెండో ఇన్నింగ్స్‌లో 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం
పల్లెకెలె: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక క్రికెట్ జట్టు 209 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది. 437 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 177/5తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 23 ఓవర్లు ఆడి మరో 50 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన శ్రీలంక అరంగేట్రం స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ రెండో ఇన్నింగ్స్‌లో 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఓవరాల్‌గా అతను ఈ మ్యాచ్‌లో 178 పరుగులిచ్చి 11 వికెట్లు తీసుకొని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. రెండు టెస్టుల్లో కలిపి మొత్తం 428 పరుగులు చేసిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.