బెంగళూరుపై తమిళ్‌ తలైవాస్‌ విజయం.. | Pro Kabaddi League 2024: Tamil Thalaivas Beat Bengaluru Bulls 45-28, Check Score Details - Sakshi
Sakshi News home page

PKL 2023: బెంగళూరుపై తమిళ్‌ తలైవాస్‌ విజయం..

Published Mon, Jan 22 2024 10:08 AM | Last Updated on Mon, Jan 22 2024 11:18 AM

Tamil Thalaivas Beat Bengaluru Bulls 45-28 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తమిళ్‌ తలైవాస్‌ 45–28 స్కోరుతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ పోరులో తమిళ్‌ రెయిడర్లు నరేందర్‌ (14), అజింక్యా పవార్‌ (11) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చి పెట్టారు. డిఫెండర్లలో సాగర్‌ (5), సాహిల్‌ గులియా (4) రాణించారు.

బెంగళూరు తరఫున రెయిడర్‌ అక్షిత్‌ (12) ఒంటరి పోరాటం చేశాడు. సుశీల్‌ 6 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్‌ 32–24 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపొందింది. పుణేరీ తరఫున మొహమ్మద్‌ రెజా 9 పాయింట్లు  మోహిత్‌ గోయత్‌ 7 పాయింట్లు సాధించారు. గుజరాత్‌ ఆటగాళ్లలో మొహమ్మద్‌ నబీబక్ష్‌ 7, ప్రతీక్‌ దహియా 5 పాయింట్లు నమోదు చేశారు.
చదవం‍డిWI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్‌ జట్టులో ఛాన్స్‌ కొట్టేశాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement