విండీస్‌ వికెట్‌కీపర్‌ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేసినా..! | West Indies Cricketer Shane Dowrich Retires From International Cricket | Sakshi
Sakshi News home page

విండీస్‌ వికెట్‌కీపర్‌ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేసినా..!

Published Fri, Dec 1 2023 9:23 AM | Last Updated on Fri, Dec 1 2023 10:18 AM

West Indies Cricketer Shane Dowrich Retires From International Cricket - Sakshi

విండీస్‌ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ షేన్‌ డౌరిచ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు లభించినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. రిటైర్మెంట్‌ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని డౌరిచ్‌ తెలిపాడు. డౌరిచ్‌ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం పట్ల విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి (టెస్ట్‌) ఎంట్రీ ఇచ్చిన 32 ఏళ్ల డౌరిచ్‌.. విండీస్‌ తరఫున 35 టెస్ట్‌లు, ఓ వన్డే ఆడాడు. టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా 1570 పరుగులు చేసిన అతను 3 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. వికెట్‌కీపర్‌గా డౌరిచ్‌ 91 మందిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. 

కాగా  3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు డిసెంబర్‌ 3 నుంచి కరీబియన్‌ దీవుల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలోని వన్డే సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లు ఇదివరకే తమ జట్లను ప్రకటించాయి. డిసెంబర్‌ 3, 6, 9 తేదీల్లో మూడు వన్డేలు.. 12, 14, 16, 19, 21 తేదీలో టీ20లు జరుగనున్నాయి. 

వన్డే సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌: హ్యారీ బ్రూక్‌, బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలే, విల్‌ జాక్స్‌, సామ్‌ కర్రన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, రెహాన్‌ అహ్మద్‌, జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), ఓలీ పోప్‌, ఫిలిప్‌ సాల్ట్‌, అట్కిన్సన్‌, టామ్‌ హార్ట్‌లీ, బ్రైడన్‌ కార్స్‌, జాన్‌ టర్నర్‌, మాథ్యూ పాట్స్‌

వెస్టిండీస్‌ జట్టు: అలిక్‌ అథాంజే, బ్రాండన్‌ కింగ్‌, జోన్‌ ఓట్లీ, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, కీసీ కార్టీ, రోస్టన్‌ ఛేజ్‌, షాయ్‌ హోప్‌ (కెప్టెన్‌), షేఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, గుడకేశ్‌ మోటీ, షేన్‌ డౌరిచ్‌, అ‍ల్జరీ జోసఫ్‌, మాథ్యూ ఫోర్డ్‌, ఒషేస్‌ థామన్‌, యాన్నిక్‌ కారయ, రొమారియో షెపర్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement