మహిళల ఐపీఎల్‌పై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. వివిధ దేశాల నుంచి మహిళా క్రికెటర్ల సంఖ్య పెరిగితే కనీసం ఎనిమిది జట్లతో త్వరలోనే లీగ్‌ను నిర్వహిస్తామని హామీ ఇచ్చాడు. మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని చాలాకాలంగా డిమాండ్ ఉందని, అతి త్వరలో మరో ఐపీఎల్(ఉమెన్)ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
పురుషుల ఐపీఎల్ తరహాలోనే ఐసీసీ సభ్య దేశాలకు చెందిన మహిళా క్రికెటర్లతో లీగ్‌ను నిర్వహిస్తామని, మరో రెండు, మూడు నెలల్లో దీనికి సంబంధించి కీలక ప్రకటనలు రాబోతున్నాయని తెలిపాడు. ఈ సందర్భంగా మహిళల టీ20 ఛాలెంజ్ ట్రోఫీకి సంబంధించి బీసీసీఐ బాస్ అప్‌డేట్ ఇచ్చాడు.
ఈ ఏడాది ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో టోర్నీని నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. కాగా, ఐపీఎల్ తరహాలోని మహిళల క్రికెట్ లీగ్‌ను ఇదివరకే ఆస్ట్రేలియా(బీబీఎల్), న్యూజిలాండ్(సూపర్ లీగ్), ఇంగ్లండ్ దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లకు కూడా పురుషుల క్రికెట్‌తో సమానమైన ఆదరణ లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే త్వరలో మహిళల ఐపీఎల్‌ను భారత్‌లో ప్లాన్ చేయాలని బీసీసీఐ యోచిస్తోంది.
చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ నెల 10 నుంచి కీలక టోర్నీ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment