న్యూఢిల్లీ:వచ్చే ఏడాది నుంచి మరో ఇండియన్స్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప‍్రారంభమయ్యే అవకాశం ఉంది. తమకు కూడా ఐపీఎల్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న మహిళా క్రికెటర్లకు సైతం ఆ లీగ్‌ను నిర‍్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ను చూసే అవకాశం ఉందని పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ సూత్రప్రాయంగా తెలియజేశారు. దేశంలోమహిళా క్రికెట్‌కు మరింత ఆదరణ కల్పించడంలో భాగంగా ఐపీఎల్‌కు శ్రీకారం చుట్టదలుచుకున్నట్లు తెలిపారు.
దీనిలోభాగంగానే వచ్చే ఏడాది నుంచి మహిళా ఐపీఎల్ పట్టాలెక్కే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలిచ్చారు. 'మహిళా క్రికెట్ కు సంబంధించి సీఓఏ సభ్యురాలైన డయానా ఎడుల్జీ, భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ బౌలర్ జులాన్ గోస్వామిలతో కలిసి చాలా ఈవెంట్లకు రూపకల్పన చేశాం. ఈ క్రమంలోనే మహిళా ఐపీఎల్ కు సైతం కార్యాచరణ రూపొందించడానికి సిద్దమవుతున్నాం. వచ్చే ఏడాది నుంచి మహిళా ఐపీఎల్ అలరించే అవకాశం ఉంది.పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లను చూడాలనేది మా లక్ష్యం' అని రాయ్ పేర‍్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment