నడి రోడ్డుపై మృతదేహాన్ని ఖననం చేసిన దృశ్యం
శ్రీ సత్యసాయి: కొన్నేళ్ల పాటు పోరాటాలు సాగించినా శ్మశాన వాటికకు అనువైన స్థలాన్ని కేటాయించకపోవడంతో ఓ మృతదేహాన్ని నడిరోడ్డుపై ఖననం చేసి గ్రామస్తులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. వివరాలు... పావగడ తాలూకా నిడుగల్ హోబళికి చెందిన క్యాతగానహళ్లిలో గతంలో ప్రభుత్వ పొరంబోకు భూమిని శవ సంస్కారాలకు వినియోగించుకునేవారు. కొన్నేల్ల క్రితం ఆ భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారు.
దీంతో మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలం లేక గ్రామస్తులు పలుదఫాలుగా అధికారులకు విన్నవించారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో గ్రామస్తులు విసిగిపోయారు. ఇటీవల ఆ గ్రామానికి చెందిన ఈరణ్ణ మృతి చెందడంతో ఆయన దేహాన్ని తీసుకెళ్లి గ్రామ శివారున నడిరోడ్డుపై ఖననం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వరదరాజు ఆగమేఘాలపై ఆ గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ప్రభుత్వ భూమిని సర్వే చేయించి శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయిస్తామని గ్రామస్తులకు హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment