తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
పట్టణ ప్రాంతాలు, పల్లెలు అన్న తేడా లేని యువత సెల్‌ఫోన్ల ద్వారా బెట్టింగులకు పాల్పడటం ఎక్కువైంది. ప్రధానంగా కళాశాలలకు వెళ్లే వారిలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను నిశితంగా గమనిస్తూ ఉండాలి. – బాలాజీ, హిందూపురం
ఆన్‌లైన్ గేమ్‌లకు
దూరంగా ఉండాలి
ఆన్‌లైన్ గేమ్‌ల బారిన పడి ఎంతోమంది యువత తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. సరదాలకు పోయి తర్వాత వ్యసనంగా మారుతోంది. యువత చేజేతులారా తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంలో నెట్టుకుంటున్నారు.
– కెవి. మహేష్, డీఎస్పీ, హిందూపురం


