ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

Mar 20 2025 12:50 AM | Updated on Mar 20 2025 12:49 AM

కదిరి టౌన్‌: సబ్‌ జైలులోని ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్‌ యాదవ్‌ జైలు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక సబ్‌ జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీలకు కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఖైదీలకు న్యాయ సాయం అందించాలని సూచించారు. అనంతరం ఖైదీలతో సమావేశమయ్యారు. జైలు జీవితం గడిపి బయటకు వెళ్లిన వారు శాంతియుత జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు నరసింహులు, రఘునాథ్‌, ప్రభాకర్‌, నరేష్‌, జైలు సూపరింటెండెంట్‌ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముదిగుబ్బలో

ఆక్రమణల తొలగింపు

ముదిగుబ్బ: స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) పరిధిలోని స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం జేసీబీ యంత్రాలతో తొలగించారు. పీఏసీఎస్‌ స్పెషల్‌ ఆఫీసర్‌, సబ్‌ డివిజన్‌ అధికారి వన్నూరుస్వామి, సీఈఓ శ్రీనివాసులు దగ్గరుండి ఆక్రమణలు తొలగించారు. పీఏసీఎస్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఉపాధ్యాయుడి ఔదార్యం

విద్యార్థులకు సొంత ఖర్చుతో

అల్పాహారం

ఓడీచెరువు: ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో ఖాళీ కడుపుతోనే ఉదయమే పాఠశాలకు వస్తున్న విద్యార్థుల ఆకలి బాధలను డబురువారిపల్లి ఉపాధ్యాయుడు కె.నాగరాజు గుర్తించారు. పాఠశాలలోని 40 మంది పిల్లలు ఇబ్బందులు పడకుండా తన సొంతఖర్చులతో ఒంటిపూట బడులు ముగిసే వరకూ అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి చేతుల మీదుగా అల్పాహార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

పరీక్ష కేంద్రం తనిఖీ

కదిరి అర్బన్‌: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆర్జేడీ శామ్యూల్‌ బుధవారం తనిఖీ చేశారు. అలాగే బాలుర హైస్కూల్‌ సెంటర్‌ను డీఈఓ కృష్ణప్ప తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు ఆరా తీశారు.

పిల్లలు వడదెబ్బ బారిన

పడకుండా చూడండి

పుట్టపర్తి అర్బన్‌: విద్యార్థులు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నివేదిత పేర్కొన్నారు. బుధవారం ఆమె పుట్టపర్తి మండలంలోని ఎనుములపల్లి అంగన్‌వాడీ కేంద్రం, ప్రశాంతిగ్రామం పాఠశాల, జగరాజుపల్లి మోడల్‌స్కూల్‌, మంగళకర పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో రికార్డులు తనిఖీ చేశారు. చిన్నారులు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల్లో రక్త హీనత నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట డాక్టర్‌ జ్యోత్స్న, డాక్టర్‌ మునిచంద్రిక, సీహెచ్‌ఓ నగేష్‌, సూపర్‌వైజర్‌ చంద్రకళ తదితరులు ఉన్నారు.

ఖైదీలకు మెరుగైన  సౌకర్యాలు కల్పించాలి 1
1/3

ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

ఖైదీలకు మెరుగైన  సౌకర్యాలు కల్పించాలి 2
2/3

ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

ఖైదీలకు మెరుగైన  సౌకర్యాలు కల్పించాలి 3
3/3

ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement