96 జిల్లాలో మద్యం దుకాణాలు | - | Sakshi
Sakshi News home page

96 జిల్లాలో మద్యం దుకాణాలు

Mar 26 2025 12:57 AM | Updated on Mar 26 2025 12:51 AM

10 జిల్లాలోని బార్ల సంఖ్య
రూ.293.15 కోట్లు 2024 అక్టోబరు 16 నుంచి ఈనెల 24 వరకు మద్యం అమ్మకాలు

● ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ వద్ద కనిపించిన దృశ్యం. ఓ వ్యక్తి తప్ప తాగి నడిరోడ్డుపై కుక్కతో ఆడుకుంటూ నానా రభస చేశాడు. ప్రశాంతి నిలయం నిబంధనల ప్రకారం పుట్టపర్తికి చుట్టుపక్కల మద్యం దుకాణాలు నిర్వహించరాదు. అయితే నిబంధనలు తుంగలో తొక్కి అక్కడే మద్యం దుకాణం.. పక్కనే రూములు, అడిగిన చోటకు మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక కేంద్రాన్ని మందుబాబుల అడ్డాగా మార్చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఇది హిందూపురం సమీపంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ నేతృత్వంలో నిర్వహిస్తోన్న అనధికారిక బార్‌లా పిలిచే బెల్టు షాపు. దర్జాగా ఫ్రిజ్‌ ఏర్పాటు చేసి మరీ కూలింగ్‌ బీర్లు అమ్ముతున్నారు. పక్కనే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. డిజిటల్‌ పేమెంట్లకు ఫోన్‌ పే స్కానర్‌ కూడా అందుబాటులో ఉంచారు. ఆంధ్ర మద్యంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బ్రాండ్లు కూడా దొరుకుతున్నాయని మందుబాబులు ఎగబడుతున్నారు.

37,78,227లీటర్లు

వివిధ బ్రాండ్‌ల మద్యం విక్రయాలు

సాక్షి, పుట్టపర్తి

కాసులకోసం కూటమి పార్టీల నేతలు జనానికి అక్రమ కిక్కు ఎక్కిస్తున్నారు. ఊరూరా ‘బెల్టు’ షాపులు ఏర్పాటు చేసి తాగినోళ్లకు తాగినంత తాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీంతో గుడి, బడి తేడా లేకుండా జిల్లాలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అడ్డుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపులు దర్శనం ఇస్తున్నాయి. ప్రధాన రహదారులు, పట్టణాల్లో సైతం బార్‌లను తలపించే విధంగా బెల్టు దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఇక లైసెన్సు పొందిన మద్యం దుకాణాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా రూములు ఏర్పాటు చేశారు. క్వార్టర్‌పై రూ.50 నుంచి రూ.100 వరకు అధికంగా పిండుకుంటున్నారు.

లేబుల్‌ మార్చి దోపిడీ

లోకల్‌గా మద్యం తయారు చేసి.. సీసాలపై ఆర్మీ లేబుళ్లు.. ఇతర రాష్ట్రాల మద్యం బ్రాండ్ల పేర్లతో కూడిన లేబుళ్లు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఎక్కువగా లేబుల్‌ మార్చి దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల మద్యాన్నీ భారీగా డంప్‌ చేసి విచ్చల విడిగా విక్రయాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఇతర రాష్ట్రాల మద్యాన్ని పట్టుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్న క్రమంలో లేపాక్షిలోని షాపునకు రూ.5 లక్షల జరిమానా విధించారు. అదేవిధంగా అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో చిలమత్తూరులోని వైన్‌ షాపును సీజ్‌ చేశారు. ఎకై ్సజ్‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగిన ప్రతిసారీ కొత్త ఘటన వెలుగు చూస్తుండటం గమనార్హం.

పర్మి(నెం)ట్‌ కిక్కు

జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా తాగేందుకు రూములు ఏర్పాటు చేశారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ తరహాలో అక్కడే తినుబండారాలు తయారీ చేసి.. సిట్టింగ్‌లకు అనుమతులు ఇస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న మద్యం దుకాణాల్లో అయితే మందుబాబుల కోసం ఏకంగా కొట్టాలు వేసి ఏర్పాట్లు చేయడాన్ని చూసి జనమే ముక్కున వేలేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఇంటి వద్దకే మద్యం డెలివరీ చేసే వ్యవస్థను తీసుకొచ్చారు.

బార్లా తెరిచేశారు

12,68,152 లీటర్లు

బీర్ల విక్రయాలు

ఉపేక్షించేది లేదు

లైసెన్సు పొందిన దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయాలు జరగాలి. ఎమ్మార్పీకి మించి అమ్మితే చర్యలు తప్పవు. కేవలం ఆంధ్ర మద్యం మాత్రమే అమ్మాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వబోం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే తనిఖీలు చేసి బెల్టు షాపుల ఆట కట్టిస్తున్నాం.

– గోవిందనాయక్‌,

ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, పుట్టపర్తి

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

గుడి, బడి తేడా లేకుండా అమ్మకాలు

అక్రమార్జనే ధ్యేయంగా కూటమి నేతలు

ఆధ్యాత్మిక కేంద్రాలనూ వదలని ‘తమ్ముళ్లు’

బార్‌లను తలపించేలా బెల్టు షాపులు

ఇష్టారాజ్యంగా పర్మిట్‌ రూముల ఏర్పాటు

ఆలయ సమీపంలోనే...

రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయానికి స్థానికులతో పాటు కర్ణాటక నుంచి భక్తులు వస్తారు. ముత్యాలమ్మపల్లిలో ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో జాతరను తలపిస్తుంది. మొక్కుచెల్లింపులో భాగంగా వందలాది యాటలు తెగుతాయి. ఇక మందుబాబుల డిమాండ్‌కు అనుగుణంగా కూటమి నేతలు ఆలయ సమీపంలోనే బెల్టు షాపు తెరిచారు. పూటుగా తాగుతున్న మందుబాబులు పవిత్రమైన స్థలంలో నానా హంగామా చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. మద్యం మత్తులో కొందరు ఆలయంలో ప్రవేశించి హుండీ చోరీ చేశారు.

96 జిల్లాలో మద్యం దుకాణాలు 1
1/5

96 జిల్లాలో మద్యం దుకాణాలు

96 జిల్లాలో మద్యం దుకాణాలు 2
2/5

96 జిల్లాలో మద్యం దుకాణాలు

96 జిల్లాలో మద్యం దుకాణాలు 3
3/5

96 జిల్లాలో మద్యం దుకాణాలు

96 జిల్లాలో మద్యం దుకాణాలు 4
4/5

96 జిల్లాలో మద్యం దుకాణాలు

96 జిల్లాలో మద్యం దుకాణాలు 5
5/5

96 జిల్లాలో మద్యం దుకాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement