నేత్రపర్వం.. నెట్టికంటుడి రథోత్సవం
గుంతకల్లు రూరల్: ఉగాది ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. సోమవారం వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామి మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, విశేష అలంకరణ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాది మంది భక్తులు బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాన్ని నిలిపి రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆలయ ఈఓ కె.వాణి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ.. నారికేళాలను సమర్పించి రథాన్ని ముందుకు లాగి ఉత్సవాని ప్రారంభించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సమేతంగా సోమవారం సాయంత్రం స్వామిరి వారిని దర్శించుకున్నారు.
నేత్రపర్వం.. నెట్టికంటుడి రథోత్సవం
నేత్రపర్వం.. నెట్టికంటుడి రథోత్సవం


