●కనిపించని కన్నీటి వ్యథ
ఊరు కాని ఊరు! రాష్ట్రం కాని రాష్ట్రం... బతుకు తెరువు కోసం వలస వచ్చారు. మండుటెండలోనే కంపచెట్ల నీడనే ఆవాసంగా మార్చుకున్నారు. కంపచెట్లను నరికి బొగ్గుగా మార్చి జీవనోపాధి పొందుతున్నారు. ఇది మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన 50 కుటుంబాల దీనగాథ. శెట్టూరు మండలం కనుకూరు గ్రామ శివారున చిట్టడవిని తలపిస్తున్న కంపచెట్లలో పాములు, తేళ్లు.. అడవి జంతువులతో సహవాసం సాగిస్తున్నారు. వీరిని పని కోసం పిలుచుకొచ్చిన వారు... కూలీలు ఉండేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయలేదు. ఎంత కూలి ఇస్తున్నారో కూడా తెలియదు. రాత్రయితే ఓ చిన్నపాటి గుడారం వేసుకుంటారు. చీకట్లోనే ఆ పూట గడిపేస్తున్నారు. ఇది వలస కూలీల దీనగాథ.. పాలకులకు కనిపించని కన్నీటి వ్యథ. – శెట్టూరు:
●కనిపించని కన్నీటి వ్యథ


