‘ఫ్యాప్టో’ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నట్లు సమాఖ్య ప్రతి నిధులు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా గజ్జల హరి ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గౌస్ లాజం, కోశాధికారిగా భాస్కర్‌రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యవర్గంలో వివిధ సంఘాల నేతలకు చోటు కల్పించామన్నారు.
పెండింగ్ బకాయిలు చెల్లించాలి..
కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు బకాయిగా ఉన్న రూ.20 వేల కోట్లను వెంటనే జమ చేయాలని ఫ్యాప్టో జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై రాబోవు రోజుల్లో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. నూతన పీఆర్సీ కోసం కమిటీ వేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, జీఓ 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రేపు కలెక్టర్ వద్ద ధర్నా..
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇందుకు నిరసనగా ఈ నెల 2వ తేదీ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం తలపెట్టినట్లి ఫ్యాప్టో నూతన జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నేటి నుంచి
సీనియర్ ఇంటర్ తరగతులు
● మండుటెండల్లో కళాశాలల
నిర్వహణపై సర్వత్రా విమర్శలు
పుట్టపర్తి: భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కు దాటగా జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లోంచి కాలు బయటపెట్టేందుకు జనం భయపడిపోతున్నారు. పాఠశాల విద్య అధికారులు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్ బోర్డు అధికారులు సెకండ్ ఇయర్ తరగతులు మంగళవారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మొదటి సంవత్సరం మూల్యాంకనం ఇంకా పూర్తి కాకుండానే రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉదయం 9 నుంచి సాయంత్రం వరకూ
మంగళవారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కళాశాలలు నడుస్తాయన్నారు. జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న 13,083 మంది విద్యార్థులు కళాశాలకు హాజరు కావాల్సి కావాల్సి ఉంటుందన్నారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కూడా ప్రారంమవుతాయన్నారు.
‘ఫ్యాప్టో’ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక


