హైకోర్టు జడ్జీలను కలిసిన ఎస్పీ రత్న | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జీలను కలిసిన ఎస్పీ రత్న

Apr 27 2025 12:58 AM | Updated on Apr 27 2025 12:58 AM

హైకోర

హైకోర్టు జడ్జీలను కలిసిన ఎస్పీ రత్న

పుట్టపర్తి టౌన్‌: హైకోర్టు జడ్జీలు రామకృష్ణప్రసాద్‌, హరహరనాథశర్మను ఎస్పీ రత్న మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన జడ్జీలను ఎస్పీ రత్నతో పాటు జిల్లా జడ్జి భీమారావ్‌, అనంతపురం ఎస్పీ జగదీష్‌ అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద కలిశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతి భద్రతలపై జడ్జీలతో కాసేపు చర్చించారు.

వీరాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

చిలమత్తూరు: సైబీరియన్‌ పక్షులకు నెలవైన వీరాపురం, వెంకటాపురం గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ తెలిపారు. శనివారం ఆయన వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో సైబీరియన్‌ పక్షుల నివాస ప్రాంతాలను పరిశీలించారు. పక్షులకు తాగునీరు, ఆహారం, సౌకర్యాలు వంటి వాటిపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొంగలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెంకటాపురం, వీరాపురం చెరువులకు నీరు నింపేందుకు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. పక్షులను సంరక్షించడంలో భాగంగా ఈ రెండు గ్రామాల చెరువులను చిత్తడి నేలగా ప్రకటించినట్టు ఆయన తెలిపారు. పర్యాటకుల కోసం వసతి సదుపాయాలు, వాచ్‌ టవర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట పెనుకొండ అటవీ క్షేత్ర అధికారి జె. శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్‌ లక్ష్మీపతిరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు ప్రారంభం

తొలిరోజు పోటాపోటీగా లీగ్‌ మ్యాచ్‌లు

కదిరి అర్బన్‌: స్థానిక ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం 54వ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లా జట్లు పాల్గొన్న ఈ టోర్నీని డీఎస్పీ శివనారాయణస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, ఏపీ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రామాంజినేయులు ప్రారంభించారు.

తొలిరోజు మ్యాచ్‌లు ఇలా...

తొలిరోజు జరిగిన లీగ్‌మ్యాచ్‌లో గుంటూరు జట్టుపై అనంతపురం జట్టు నాలుగు గోల్స్‌ తేడాతో గెలుపొందింది. అనంతరం జరిగిన మ్యాచ్‌లో శ్రీకాకుళం జట్టుపై కర్నూలు, అనంతపురం జిల్లా జట్టుపై వైఎస్సార్‌ జిల్లా, ఈస్ట్‌ గోదావరి జట్టుపై వెస్ట్‌ గోదావరి, నంద్యాల జట్టుపై చిత్తూరు, ప్రకాశం జట్టుపై వెస్ట్‌ గోదావరి, నంద్యాల జట్టుపై విజయనగరం, బాపట్ల జట్టుపై కర్నూలు జట్లు విజయం సాధించాయి.

హైకోర్టు జడ్జీలను కలిసిన ఎస్పీ రత్న 1
1/2

హైకోర్టు జడ్జీలను కలిసిన ఎస్పీ రత్న

హైకోర్టు జడ్జీలను కలిసిన ఎస్పీ రత్న 2
2/2

హైకోర్టు జడ్జీలను కలిసిన ఎస్పీ రత్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement